GOD : గజవాహనంపై ఊరేగిన విశ్వనాథుడు
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:18 AM
మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఏడోరోజు మంగళవారం కాశీవిశాలాక్షి సమేత విశ్శ్వేశ్వరు డు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం శివలింగానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పుష్పా లంకరణ, ప్రత్యేక పూజ నిర్వహించారు.

అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఏడోరోజు మంగళవారం కాశీవిశాలాక్షి సమేత విశ్శ్వేశ్వరు డు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం శివలింగానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పుష్పా లంకరణ, ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయంలో దీక్షాహోమం చేశారు. సాయంత్రం విశేషంగా అలంకరించిన గజవాహనంపై స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి మొదటిరోడ్డు, రెండో రోడ్డు మీదుగా ఊరేగించారు. ఊరేగింపులో ఆలయ ఈఓ రమేష్‌బాబు, అనువంశీకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం, ఽనరేంద్ర చౌదరి, శ్రీనివాసులు, ఎర్రిస్వామి, పరమేష్, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....