MLA : చంద్రబాబు పాలనలోనే గ్రామాభివృద్ధి
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:38 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన లోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. మండలంలోని అయ్య వారిపల్లిలో రూ. 40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శనివారం భూమి పూజ చేశారు.

ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన లోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. మండలంలోని అయ్య వారిపల్లిలో రూ. 40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కొన్నేళ్ల నుంచి రోడ్డు సమస్యతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు తెలుపడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి జిల్లా పరిషత 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయిం చామన్నారు. టీడీపీ కూటమి ప్రభు త్వం అఽధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రాప్తాడు నియోజక వర్గంలోని అనేక గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో రోడ్ల సమస్య లేకుండా చేస్తామన్నా రు. కార్యక్రమంలో టీడీపీ మండల ఇనచార్జ్ ధర్మవరపు మురళి, పంచా యతీరాజ్ డీఈ లక్ష్మీనారాయణ, ఏఈ కిషోర్, తహసీల్దార్ విజయకుమారి, ఎంపీడీఓ విజయలక్ష్మి, టీడీపీ మండల కన్వీనర్ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సర్పంచులు శశికళ, తిరుపాలు, ఉప్పర శ్రీనివాసులు, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....