Share News

SPORTS : క్రీడల్లో మహిళల ప్రతిభ అనిర్వచనీయం

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:01 AM

క్రీడల్లో మహిళలు రాణిస్తుండడం అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తోందని ఆర్డీటీ మహిళా సాధికారత డైరెక్టర్‌ విశాలా ఫెర్రర్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక అనంతపురం క్రికెట్‌ గ్రౌండ్‌లో అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ, ఆర్డీటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళా క్రికెట్‌ కప్‌-2025 టోర్నీ ప్రారంభోత్స వానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసి టోర్నీని ప్రారంభించారు.

SPORTS : క్రీడల్లో మహిళల ప్రతిభ అనిర్వచనీయం
Visalaferrer introducing the players

అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): క్రీడల్లో మహిళలు రాణిస్తుండడం అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తోందని ఆర్డీటీ మహిళా సాధికారత డైరెక్టర్‌ విశాలా ఫెర్రర్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక అనంతపురం క్రికెట్‌ గ్రౌండ్‌లో అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ, ఆర్డీటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళా క్రికెట్‌ కప్‌-2025 టోర్నీ ప్రారంభోత్స వానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసి టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాలాఫెర్రర్‌ మాట్లాడుతూ... మహిళలు క్రీడల్లో అం దివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో క్రీడలకు, క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యం, ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. మొత్తం ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. అనంతరం జరిగిన పోటీల్లో కర్నూలు జట్టుపై మయూఖా అకాడమి ఒంగోలు జట్టు, చిత్తూరు డీసీఏ జట్టుపై అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ జట్టు, ఏఎస్‌ఏ జీఆర్‌ జట్టుపై ఎమ్మెస్కే అకాడమీ హైదరాబాద్‌ జట్టు గెలుపొందాయి. కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ, విజయవాడ హరికృష్ణ, యూఖా అకా డమీ వెంకటేశ్వరరెడ్డి, కోచలు కుమార్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. ్చ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 17 , 2025 | 12:01 AM