Share News

COLLECTOR : స్కావెంజర్‌ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:44 AM

మ్యానహోల్‌ స్కావెంజర్‌ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీ గా అమలు చేయాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికా రులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం సం బంధిత అదికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... సమాజంలో మార్పుకోసం విజిలెన్స కమిటీ సభ్యులు కృషిచేయా లని సూచించారు. ఇప్పటికీ మ్యానహోల్‌లోకి మనషు లను దించుతున్నారని, అలాచేసిన అధికారులపై వి చారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇంతకు ము నుపు నోటీసులు ఇచ్చారన్నారు.

COLLECTOR : స్కావెంజర్‌ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి
The collector is speaking.

- కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశం

అనంతపురం టౌన, మార్చి 6(ఆంధ్రజ్యోతి) : మ్యానహోల్‌ స్కావెంజర్‌ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీ గా అమలు చేయాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికా రులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం సం బంధిత అదికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... సమాజంలో మార్పుకోసం విజిలెన్స కమిటీ సభ్యులు కృషిచేయా లని సూచించారు. ఇప్పటికీ మ్యానహోల్‌లోకి మనషు లను దించుతున్నారని, అలాచేసిన అధికారులపై వి చారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇంతకు ము నుపు నోటీసులు ఇచ్చారన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్స వం సందర్భంగా మహిళా పారిశుధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబి రాలు నిర్వహించి, అవసరమైన మందులు అందించాలని వైద్యశాఖాధి కారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడి పారిశుధ్య కార్మికులకు అవసరమైన సామగ్రి అందించేందుకు కృషిచేయాలని అధికారులను ఆదేశించా రు. జీతాలు సకాలంలో అందేలా ఆయా శాఖలు చూడాలన్నారు. కార్యక్ర మంలో సోషల్‌ వెల్ఫేర్‌ జేడీ రాధిక, నగరపాలక సంస్థ కమిషనర్‌ బాలస్వామి, డ్వామా పీడీ సలీమ్‌బాషా, ఎల్‌డీఎం నర్హింగరావు, డీఎంహెచఓ డాక్టరు ఈబీ దేవి, వివిధ శాఖల అదికారులు పాల్గొన్నారు.

మహిళాదినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి

అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్‌ వద్ద ఉన్న బాలసదన నుంచి వీడియో కాన్ఫరెన్సలో అదికారులతో మాట్లాడారు. మహిళా దినోత్సవాలను జేఎనటీయూ ఆడిటోరియంలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అక్కడ అవసరమైన ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కాన్ఫరెన్సలో డీఆర్‌ఓ మలోల, ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ అధికారి రామక్రిష్ణారెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, ఎల్‌డీఎం నర్శింగరావు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 07 , 2025 | 12:44 AM