MINISTER : ఎంపీఈఓల సమస్యలపై కేబినెట్‌లో ప్రస్తావిస్తా
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:12 AM
వ్యవసాయ శాఖ ఎంపీఈఓలకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపజే సే విషయాన్ని కేబినెట్‌లో ప్రస్తావించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఎంపీఈఓల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌నాయక్, ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఈసీ సభ్యులు తమ సమస్యలను మంత్రికి వివరించారు.

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అనంతపురం అర్బన, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖ ఎంపీఈఓలకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపజే సే విషయాన్ని కేబినెట్‌లో ప్రస్తావించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఎంపీఈఓల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌నాయక్, ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఈసీ సభ్యులు రమేష్, సాంబశివ, ప్రశాంతి, నాగజ్యోతి, అపర్ణ, గీత, పద్మావతి, గాయత్రి ఆదివారం పెనుకొండలోని మంత్రి క్యాంప్ కార్యా లయంలో తమ సమస్యలను మంత్రికి వివరించారు. మంత్రి స్పందిస్తూ... సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తాన న్నా రు. మంత్రి అచ్చెంనాయుడు, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కమిషనర్‌కు తన లెటర్ ప్యాడ్‌తో మెయిల్ ద్వారా లేఖలు పంపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....