Share News

MLA : అంగనవాడీల పనితీరు మారాలి

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:04 AM

అర్బన నియోజకవర్గం పరిధిలో అంగనవాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది పనితీరు మారకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ హెచ్చరించారు. ఆయన శుక్రవారం నగరంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఐసీడీఎస్‌ పీడీ వనజా అక్కమ్మ, సీడీపీఓలు లలిత, ధనలక్ష్మి, సూపర్‌వైజర్లతో సమావేశమ య్యారు.

MLA : అంగనవాడీల పనితీరు మారాలి
MLA Daggupati met with ICDS officials

ఎమ్మెల్యే దగ్గుపాటి హెచ్చరిక

అనంతపురం అర్బన, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): అర్బన నియోజకవర్గం పరిధిలో అంగనవాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది పనితీరు మారకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ హెచ్చరించారు. ఆయన శుక్రవారం నగరంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఐసీడీఎస్‌ పీడీ వనజా అక్కమ్మ, సీడీపీఓలు లలిత, ధనలక్ష్మి, సూపర్‌వైజర్లతో సమావేశమ య్యారు. అర్బన నియోజకవర్గంలో అంగనవాడీ కేంద్రాల నిర్వహణపై ఆరా తీశారు. నియోజకవర్గంలో అంగనవాడీ కేంద్రాల పనితీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రాల్లో కార్యకర్తలు ఉండకుండా ఆయాల మీద వదిలేసి వెళుతున్నారని, ఇది ఏ మాత్రం సరి కాదన్నారు. కొన్ని కేంద్రాల్లో ఆయాలకు పనులన్నీ అప్పగించి కార్యకర్తలు విధులకు హాజరు కావడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. కోడి గుడ్లు, చిక్కీలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను ఎక్కడా చూడటం లేదన్నారు. గర్భిణు లు, పిల్లలపై కొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అంగనవాడీల పనితీరులో మార్పు రావాలని, ఆ మేరకు అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి అంగనవాడీ కేంద్రంలో సీఎం చంద్రబా బు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ ఫొటోలు కచ్చితంగా ఉండాలన్నారు. కొన్ని అంగనవాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, కొత్త భవనాల కోసం స్థల సేకరణ, నిర్మాణాలకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌ వైజర్లు కొండమ్మ, విష్ణువర్ధిని, విజయలక్ష్మి, లీలావతి, ఝాన్సీ, విజయశ్రీ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 08 , 2025 | 12:04 AM