CPI: ఇళ్ల స్థలాల హామీని ప్రభుత్వం నెరవేర్చాలి
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:22 AM
పేదలకు ఎన్నికల ముందు ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ రాప్తాడు నియోజకవర్గం ఆధ్వర్యంలో అనంతపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద వందలాదిమంది మహిళలు, నాయకులు ధర్నాచేశారు.

సీపీఐ నాయకుల డిమాండ్ - ఆర్ట్డీఓ కార్యాలయం వద్ద ధర్నా
అనంతపురం విద్య, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఎన్నికల ముందు ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ రాప్తాడు నియోజకవర్గం ఆధ్వర్యంలో అనంతపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద వందలాదిమంది మహిళలు, నాయకులు ధర్నాచేశారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ....నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలాలు అందజేయాలన్నారు. జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ.. ప్రతి కేబినెట్ మీటింగ్‌లో పక్కా ఇళ్ల నిర్మాణం చేపడతామ న్న మాటలు మినహా ముందుకు సాగడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 33 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని, ఇళ్ల నిర్మాణాలకు రూ.1.80 లక్షలు మాత్రమే ఇచ్చారన్నారు. అది ఏమాత్రం సరిపోదన్నారు. జిల్లా ్లసహాయ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ....సోములదొడ్డి, ఇంద్ర జితనగర్, రాచానపల్లి ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని 15 ఏళ్లుగా నివాసం ఉంటున్నవాళ్లకు ఇళ్లపట్టాలు ఇవ్వాల న్నారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందిం చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కేశవరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్‌గౌడ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, ఇతర నాయకులు కృష్ణుడు, వన్నారెడ్డి, రమేష్, నరేష్, చలపతి, ధనుంజయ, రాజు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....