Share News

PROGRESS : అభివృద్ధి అంతంతే..

ABN , Publish Date - Jan 28 , 2025 | 12:39 AM

మున్సి పాలిటీగా ఉన్న అనంతపురా న్ని కార్పొరేషనగా మార్చాక 32 వ డివిజన ప్రత్యేకంగా ఏర్ప డింది. అనంతపురం గతంలో మున్సిపాలిటీగా ఉండేది. 2005లో నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో 28 వార్డులున్న అనంతపురా న్ని 50 డివిజన్లుగా మార్చారు.

PROGRESS :  అభివృద్ధి అంతంతే..
Unchanged dirt roads in the division

ఇప్పటివరకు ముగ్గురు కార్పొరేటర్లు ఎన్నిక

అనంతపురం క్రైం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మున్సి పాలిటీగా ఉన్న అనంతపురా న్ని కార్పొరేషనగా మార్చాక 32 వ డివిజన ప్రత్యేకంగా ఏర్ప డింది. అనంతపురం గతంలో మున్సిపాలిటీగా ఉండేది. 2005లో నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో 28 వార్డులున్న అనంతపురా న్ని 50 డివిజన్లుగా మార్చారు. విభజనలో భాగంగా 32వ డివిజన ఏర్ప డింది. ఆ డివిజన పరిధిలో ప్రస్తుతం విద్యుతనగర్‌, ఆదర్శనగర్‌, ఓబుళ దేవ్‌నగర్‌, లక్ష్మీనరసయ్య కాలనీలో కొంతభాగం, సెవెనహిల్స్‌ కాలనీ, ఎఫ్‌సీఐ కాలనీలు ఉన్నాయి. డివిజన పరిధిలో దాదాపు 1500ఇళ్లు ఉండ గా, మొత్తం 6250 ఓట్లు ఉన్నాయి. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు నిధులు లేకపోవడంతో, అధిక కాలనీలున్న ప్రాంతంలో ఉండటంతో అభివృద్ధి ఏమాత్రం ఉండేది కాదు. ప్రత్యేక డివిజనగా ఏర్పాటయ్యాక కూడా మార్పు లేదు. అభివృద్ది అంతంత మాత్రంగానే ఉందని స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్తులో నైనా అభివృద్ధి చూడాలని కాంక్షిస్తున్నారు.

అప్పట్లో శివారు కాలనీలు

ఈ డివిజన పరిధిలో తొలుత ఏర్పడింది విద్యుత నగర్‌. ఆ తరువాత ఓబుళదేవ్‌నగర్‌, ఆదర్శనగర్‌ ఏర్పడ్డాయి. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు సాయినగర్‌ మూడో క్రాస్‌ నుంచి ఈ కాలనీలన్నీ అప్పుడు ఒకే వార్డు పరిధిలో ఉండేవి. అప్పట్లో ఇవి శివారు కాలనీలు. 2005లో తొలిసారి కార్పొరేషన ఎన్నికలు జరిగాయి. క్రమంగా లక్ష్మీనరసయ్య కాలనీ ఏర్పడింది. ఇక కొందరు ఇళ్లు కట్టుకుని సెవెనహిల్స్‌ కాలనీని ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో ఎఫ్‌సీఐ కాలనీ ఏర్పడింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 28 , 2025 | 12:40 AM