Share News

MLA : కూటమితోనే విద్యా రంగం అభివృద్ధి

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:35 AM

కూటమి ప్రభుత్వం తోనే విద్యా రంగం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. దయనీయ పరిస్థితుల్లో ఉన్న హాస్టళ్లకు కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే నగరంలోని మరమ్మతులు చేపట్టిన గిల్డాఫ్‌ సర్వీస్‌ స్కూల్‌ పక్కనున్న ఎస్సీ నెం2 ప్రీమెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ బాలికల వసతిగృహాలను బుధవారం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ ముఖ్య అతిథులు గా హాజరై ప్రారం భించారు.

MLA : కూటమితోనే విద్యా రంగం అభివృద్ధి
MLA Daggupati Venkateswara Prasad inaugurating the hostel

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌

పునరుద్ధరించిన వసతి గృహాల ప్రారంభం

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం తోనే విద్యా రంగం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. దయనీయ పరిస్థితుల్లో ఉన్న హాస్టళ్లకు కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే నగరంలోని మరమ్మతులు చేపట్టిన గిల్డాఫ్‌ సర్వీస్‌ స్కూల్‌ పక్కనున్న ఎస్సీ నెం2 ప్రీమెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ బాలికల వసతిగృహాలను బుధవారం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ ముఖ్య అతిథులు గా హాజరై ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..... కూటమి ప్రభుత్వం లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు కంకణబద్ధులై ఉన్నారన్నారు. దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ హా స్టల్‌ భవనాలను ఇంత వరకూ ఏ పాలకుడు పట్టించు కోలేదని, కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకు న్న నారా లోకేశ బాగు చేస్తున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 501 పా ఠశాలల్లో రూ. 1.15 కోట్లతో మరమ్మతులు చేపడుతున్నారన్నారు. ప్రతి పాఠశాల, వసతిగ ృహంలో ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా... వసతిగృహంలోని పలువురు విద్యార్థినులు ఆర్‌ఓ ప్లాం టు చెడిపోయిందని తెలుపగా, మరమ్మతులు చేయిస్తానని ఎమ్మెల్యే హా మీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుగ్గయ్య చౌదరి, ఎస్సీ సంక్షేమశాఖ డీడీ ప్రతాప్‌ సూర్యనారాయణ రెడ్డి, డీఈ రమణారెడ్డి, ఏఎస్‌డబ్ల్యూఓ దామోదర్‌ రెడ్డి, ఎస్సీ వెల్ఫేర్‌ సూపరింటెండెంట్‌ రాజేష్‌, ఏబీసీడబ్ల్యూఓ సుభాషిణి, వార్డెన్లు అనిత, వసంత, మాధవి, నాగార్జున రెడ్డితో పాటు వసతి గృహాల విద్యార్థినులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 09 , 2025 | 12:35 AM