HOSPITAL: నత్తనడకన ఆస్పత్రి నిర్మాణం
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:04 AM
మూడు నియోజకవర్గాల ప్రజల వైద్యసేవలకు మూలమైన కదిరి ఏరియా ఆసుపత్రిని భవనాల కొరత పీ డిస్తోంది. ముఖ్యంగా ఓపీ విభాగం భవనం లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కదిరి నియోజకవర్గంతో పాటు పుట్టపర్తి, ధర్మ వరం నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల ప్రజలు అవసరమైనా, అత్యవ సరమైనా ఇక్కడికి రావాల్సిందే. దీనిని 1999లోనే వంద పడకల సా మర్థ్యంతో, అన్ని వసతులతో నిర్మించారు.
- నాలుగేళ్లుగా కొనసాగుతున్న పనులు
- వసతులు లేక రోగులు, డాక్టర్ల అగచాట్లు
కదిరి, జూన 17(ఆంధ్రజ్యోతి): మూడు నియోజకవర్గాల ప్రజల వైద్యసేవలకు మూలమైన కదిరి ఏరియా ఆసుపత్రిని భవనాల కొరత పీ డిస్తోంది. ముఖ్యంగా ఓపీ విభాగం భవనం లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కదిరి నియోజకవర్గంతో పాటు పుట్టపర్తి, ధర్మ వరం నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల ప్రజలు అవసరమైనా, అత్యవ సరమైనా ఇక్కడికి రావాల్సిందే. దీనిని 1999లోనే వంద పడకల సా మర్థ్యంతో, అన్ని వసతులతో నిర్మించారు. అయితే చాలా ఏళ్ల క్రితం ని ర్మించిన కొన్ని ఆసుపత్రి గదులు శిథిలావస్థకు చేరాయి. దీంతో గత వైపీ ప్రభుత్వంలో ఇనపేషెంట్, ఎమెర్జెన్సీ విభాగాలు మినహా మిగతా భవ నాన్ని కూల్చివేశారు. నూతన భవన నిర్మాణానికి 2021 మార్చి 27న భూ మి పూజ చేశారు. రెండేళ్లలో ఈ భవన నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కానీ నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్ అర్థాంతరంగా ఆపివేశారు. మధ్య లో అరకొర నిధులు ఇవ్వడంతో కొద్దికొద్దిగా పూర్తి చేశారు. ప్రస్తుతం 80 శాతం పూర్తయింది. నిధులు లేని కారణంగా మిగిలిన 20 శాతం నిర్మాణం ఆగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన, ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ పలుమార్లు ఈ నిర్మాణాలపై సమీక్షించడంతో కాం ట్రాక్టర్ పనులు మొదలు పెట్టినా, నిర్మాణం నత్తనకడకనే సాగుతోంది.
ఓపీ వద్ద ఇబ్బందులు
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న భవనాలను కూల్చివేయడంతో నాలుగేళ్లుగా రోగులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అవుట్ పేషెంట్(ఓపీ) గ దులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ రోజుకు 500మందికి పైగా ఓపీ ఉంటుంది. గతంలో ఉద్యోగుల కోసం నిర్మించిన గదుల్లో ప్రస్తుతం ఓపీ నిర్వహిస్తున్నారు. ఓపీ చీటీలు రాయడానికి ఆరు బయటే ఏర్పాటు చేశారు. ఇక్క రోగులు కూర్చోవడానికి కూడా వసతి లే దు. అలాగే రోగులు ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఇది లా ఉంటే ఆసుపత్రిలో భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో గదులు లేక అవుట్ పేషెంట్లకు వైద్య పరీక్షలు చేయడానికి నాలుగేళ్లుగా డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన వెలుతురు లేని ఇరుకు గదుల్లో ఇద్దరు డాక్టర్లు ఉంటున్నారు. ఇక్కడ రోగులు నిలబడేందుకు కూడా చోటు ఉండదు. ఆసుపత్రి ఆవరణంలోనే అన్ని విభాగాల రోగులు ఉండాల్సి వ స్తోంది. దీంతో ఆసుపత్రి ఆవరణమంతా రోగులతో కిక్కిరిసి పోతోంది. అలాగే ఎక్సెరే తదితర ల్యాబ్‌లన్నీ ఒకే చోట చిన్న గదిలో తాత్కాలికంగా ఏర్పాటుచేశారు. ఇవి వైద్య పరీక్షలకు అనుకూలంగా లేవు.
అపరిశుభ్రంగా ఆసుపత్రి ఆవరణం
భవన నిర్మాణం కొనసాగుతుండడంతో ఆసుపత్రిఅంతా ఆపరిశుభ్రంగా తయారైంది. ఉన్న ప్రహరీ కూల్చివేయడంతో పాటు కంకర, ఇసుక అక్కడే వేయడంతో ఆ ప్రాంతమంతా దుమ్ముధూళితో నిండిపోయింది. ఆసుపత్రి లోని రోడ్డు దెబ్బదినడంతో అత్యవసర విభాగం నుంచి, సాధారణ విభాగా నికి సె్ట్రచర్ లేదా వీల్‌చైౖర్‌లో రోగులను తీసుకెళ్లేందుకు సాహసో పేతంగా ఉందని సిబ్బంది, రోగుల సహాయకులు అంటున్నారు. ఓపీ నుంచి ఇన పేషెంట్ విభాగానికి వెళ్లే దారికూడా లేక పోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర విభాగం వద్ద కూర్చోవడానికి కూడా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఇసుక, కంకర, కడ్డీలు ఉండడంతో రోగులకు అసౌక ర్యంగా ఉంది.
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం - విజయలక్ష్మి, సూపరింటెండెంట్
ఆసుపత్రిలో భవన నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. వచ్చే సోమవారం కూడా ఆసుపత్రి కమిటీ చైర్మన, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో చర్చిస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....