Share News

SP: సైబర్‌ బాధితులు కాకూడదనేదే ధ్యేయం : ఎస్పీ

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:32 AM

సైబర్‌ నేరగాళ్ల చేతిలో జిల్లా ప్రజలు బాధితులు కాకూడదనేదే జిల్లా పోలీసుల ధ్యేయమని ఎస్పీ జగదీష్‌ స్పష్టం చేశారు. సైబర్‌ సేఫ్‌ అనంతపురం కోసం జిల్లా పోలీస్‌ శాఖ సైబర్‌ సురక్ష(మన భద్రత-మన బాధ్యత)లో భాగంగా చేపట్టిన 2.5కె రనను స్థానిక పోలీస్‌ పరేడ్‌ మైదానం వద్ద జిల్లా ఎస్పీ జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు.

SP: సైబర్‌ బాధితులు కాకూడదనేదే ధ్యేయం : ఎస్పీ
2.5K in the city SC, officials

అనంతపురం క్రైం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్ల చేతిలో జిల్లా ప్రజలు బాధితులు కాకూడదనేదే జిల్లా పోలీసుల ధ్యేయమని ఎస్పీ జగదీష్‌ స్పష్టం చేశారు. సైబర్‌ సేఫ్‌ అనంతపురం కోసం జిల్లా పోలీస్‌ శాఖ సైబర్‌ సురక్ష(మన భద్రత-మన బాధ్యత)లో భాగంగా చేపట్టిన 2.5కె రనను స్థానిక పోలీస్‌ పరేడ్‌ మైదానం వద్ద జిల్లా ఎస్పీ జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. ఎస్పీ సారథ్యంలో ప్రారంభమైన ఈ రన జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌, సప్తగిరి సర్కిల్‌, సుభాష్‌రోడ్డు, క్లాక్‌టవర్‌, కోర్టు రోడ్డు మీదుగా తిరిగి పోలీస్‌ పరేడ్‌ మైదానానికి చేరుకుంది. సైబర్‌ మోసాల అప్రమత్తత కోసం సహకరించిన వారికి, పోలీస్‌ అధికారు లకు మెమెంటోలు అందజేశారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ ఇలియాజ్‌బాషా, అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్‌ డీఎస్పీ నీలకంఠేశ్వర్‌రెడ్డి, సీఐలు షేక్‌ జాకీర్‌, సాయినాథ్‌, శ్రీకాంతయాదవ్‌, శాంతిలాల్‌, శేఖర్‌, రఘుప్రసాద్‌, ఆర్‌ఐలు మధు, బాబు, రాముడు, ఆర్‌ఎస్‌ఐలు జాఫర్‌, మగ్బుల్‌, రమేష్‌నాయక్‌, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నార్పల: ప్రజలు సైజర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జగదీష్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాఫూలే బీసీ గురుకుల పాఠశా లలో సైబర్‌ సురక్షలో భాగంగా సైబార్‌ మోసాలపై అవగాహన కార్యక్ర మాన్ని మంగళవారం నిర్వహించారు. ఎస్పీ హాజరై మాటాడారు. అనంత రం సైబర్‌ నేరాలపై డ్రాయింగ్‌ కాంపిటీషన పోటీలు నిర్వహించి, గెలు పొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ సంగీతకుమారి, ఎస్‌ఐ సాగర్‌, సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 26 , 2025 | 12:32 AM