MLA: కూటమితోనే ఆలయాలకు శోభ: ఎమ్మెల్యే దగ్గుపాటి
ABN , Publish Date - Feb 27 , 2025 | 01:03 AM
గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో ఆలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆలయాలకు శోభ వచ్చిందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు.
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో ఆలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆలయాలకు శోభ వచ్చిందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం లో వేడుకలకు ఎమ్మెల్యే దగ్గుపాటి ముఖ్యఅతిథిగా హాజరై స్వామి, అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం శివపార్వతుల నగరోత్సవం లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా భక్తులకు ప్రసాదాల పంపిణీ చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆలయాలకు దేవదాయశాఖ ద్వారా అన్ని రకాలుగా సహకారం అందిస్తోందన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సాకే రమేష్‌బాబు, అనువంశీకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం, బలిజ యువజన సంఘం అధ్య క్షుడు రమేష్ రాయల్, నలుబోలు మధురాయల్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....