Audio Viral: సంచలనం సృష్టిస్తున్న తాడిపత్రి అర్బన్ సీఐ ఆడియో వైరల్
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:30 AM
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనను వేరే వాళ్ళతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నారని, జేసీ ఫోన్ నెంబర్ కావాలని రాం పుల్లయ్య అనే వ్యక్తి సీఐ సాయిప్రసాద్‌ను అడిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఐ తానేమి మీ సర్వెంట్‌ను కాదని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ తానేందుకు ఇవ్వాలంటూ రాం పుల్లయ్యను గద్దించారు. ఈ క్రమంలో...

అనంతపురం జిల్లా: తాడిపత్రి (Tadipatri) అర్బన్ సీఐ సాయిప్రసాద్ (Urban CI Sai Prasad) ఆడియో (Audio) సంచలనం సృష్టిస్తోంది. తాడిపత్రికి చెందిన రాం పుల్లయ్య అనే వ్యక్తి... తాడిపత్రి అర్బన్ సీఐ సాయి ప్రసాద్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తనను వేరే వాళ్ళతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నారని, జేసీ ఫోన్ నెంబర్ కావాలని రాం పుల్లయ్య అనే వ్యక్తి సీఐ సాయిప్రసాద్‌ను అడిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఐ తానేమి మీ సర్వెంట్‌ను కాదని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ తానేందుకు ఇవ్వాలంటూ రాం పుల్లయ్యను గద్దించారు. ఈ క్రమంలో రాం పుల్లయ్య.. సీఐ సాయి ప్రసాద్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆడియో వైరల్ కావడంతో జిల్లా ఎస్‌పీ జగదీష్ విచారణకు ఆదేశించారు.
ఈ వార్త కూడా చదవండి..
శ్రీసత్యసాయి జిల్లాలో అమానుష ఘటన..
కాగా ‘రాజకీయాల్లో నీ పనైపోయింది. నీవో ఫే డౌట్ నాయకుడివి. నీది రాబంధుల పార్టీ’ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి తొక్కిసలాటపై జగన్ వ్యాఖ్యలకు ఆయన ఆదివారం అనంతపురంలో ఘాటుగా స్పందించారు. జగన్‌వన్నీ శవ రాజకీయాలేనన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్నో ఘటనలు జరిగాయనీ, ఎంతోమంది ప్రాణాలు పోయాయని తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 33 మంది చనిపోతే, అప్పుడెందుకు అక్కడికెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించలేదని జగన్‌ను నిలదీశారు. ఎల్‌జీ పాలిమర్స్ ఘటనలో 13 మంది చనిపోతే.. అక్కడికెందుకు వెళ్లలేదని, రుయా ఆస్పత్రిలో 12 మంది చనిపోతే అక్కడికెందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ‘జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి అనేక మంది చనిపోతే. అక్కడికెళ్లి పరామర్శించావా.. బోటు ప్రమాదంలో 39 మంది చనిపోతే. అక్కడికెళ్లావా... మరి ఆగమేఘాల మీద ఇప్పుడెందుకు వెళ్లావ్..’ అని నిలదీశారు. ‘రోజక్కా... నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఆనం కుటుంబం గురించి తెలుసుకుని మాట్లాడు. తైతక్కలాడే రోజమ్మా నోరు అదుపులో పెట్టుకో. నేను నోరు విప్పితే నీ బండారమంతా బయటపడుతుంది’ అని హెచ్చరించారు. చంద్రబాబు పుణ్యమా అని రాజకీయాల్లోకి వచ్చావన్నది మర్చిపోవద్దని, మరోసారి నోరు పారేసుకుంటే కార్యకర్తలు బయట తిరగనివ్వరని చెప్పారు. అనంతపురంలో రోజాపై చెక్‌బౌన్స్ కేసులున్నాయని జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడివాడలో ప్రాణం తీసిన సిగరెట్...
తిరుమలలో భక్తుల రద్దీ.. వైకుంఠ ద్వారా దర్శనం
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు.. ఎందుకంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News