Share News

COMPETITIONS ; రాతి దూలం లాగుడు పోటీలు

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:46 AM

మండల పరిధిలోని సనప మాధవరాజుల స్వామి ఉత్సవాల సందర్భంగా పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. టీడీపీ మండల ఇనచార్జ్‌ బాలాజీ పోటీలను ప్రారంభించారు. జనరల్‌ విభాగానికి నిర్వహించిన పోటీల్లో 10 జతల ఎద్దులు పాల్గొన్నాయి. వందలాది మంది రైతులు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చారు.

COMPETITIONS ;  రాతి దూలం లాగుడు పోటీలు
TDP mandal in-charge Balaji is starting the contests

ఆత్మకూరు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని సనప మాధవరాజుల స్వామి ఉత్సవాల సందర్భంగా పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. టీడీపీ మండల ఇనచార్జ్‌ బాలాజీ పోటీలను ప్రారంభించారు. జనరల్‌ విభాగానికి నిర్వహించిన పోటీల్లో 10 జతల ఎద్దులు పాల్గొన్నాయి. వందలాది మంది రైతులు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చారు. ఉత్సాహంగా జరిగిన పోటీల్లో మండలంలోని తోపుదుర్తి గ్రామానికి చెందిన చెన్నప్ప ఎద్దులు 4,227అడుగులు లాగి మొదటి బహుమతిగా రూ. 50వేలు గెలుచుకున్నాయి. సోములదొడ్డి రామసుబ్బారెడ్డి ఎద్దులు, కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలోని హుసేనపురానికి చెందిన ఎద్దులు 3,596 అడుగులు లాగి రెండో బహుమతి రూ. 40వేలను కంబైన్డ అందుకున్నాయి. మండల కేంద్రమైన గార్లదిన్నెకు చెందిన రామాంజనేయులు ఎద్దులు 3,592 అడుగులు లాగి మూడో బహుమతి రూ. 30వేలను, తోపుదుర్తి చెన్నప్ప ఎద్దులు 3,314అడుగులు లాగి నాలుగో బహుమతి రూ. 20వేలు గెలుచుకున్నాయి. గార్లదిన్నెకు రామాంజనేయులు ఎద్దులు 3,045అడుగులు లాగి ఐదో బహుమతి రూ. 10వేల ను అందుకున్నాయి. విజేతలైన ఎద్దుల యజమానులకు పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నగదు బహెమతులను టీడీపీ మండల నాయకులతో కలిసి మండల ఇనచార్జ్‌ అందజేశారు. అలాగే ప్రతి జతకు పరిటాల రవీంద్ర, సునీత, శ్రీరామ్‌ ఫొటో కలిగిన జ్ఘాపికను, ఎద్దులకు దానా గిన్నెలను అందజేశారు. అనంతరం మాధవరాజులు స్వామి ఉత్సవాల సందర్భంగా గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న పౌరాణికి నాటకానికి పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్టు ఆద్వర్యంలో రూ. 50వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలకన్వీనర్‌ శ్రీనివాసులు, తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి, ఎనఆర్‌ఐ ప్రభాకర్‌, పరిటాల సుబ్రహ్మణ్యం, మనోహర నాయుడు, వెంకట నారాయణ, రఘునాథరెడ్డి, నాగన్న, కిష్టప్ప చౌదరి, పోతులయ్య, వెంకట్రామిరెడ్డి, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 06 , 2025 | 12:46 AM