MLA: త్వరలో ఇళ్ల మంజూరుకు చర్యలు : ఎమ్మెల్యే
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:38 AM
అర్బన నియోజకవర్గం పరిధిలో ఇళ్లులేని వారికి త్వరలో ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటా మని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక 39వ డివిజనలో గురువారం మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిం చారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
త్వరలో ఇళ్ల మంజూరుకు చర్యలు : ఎమ్మెల్యే
అనంతపురం అర్బన, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): అర్బన నియోజకవర్గం పరిధిలో ఇళ్లులేని వారికి త్వరలో ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటా మని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక 39వ డివిజనలో గురువారం మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిం చారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, వీధి దీపాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరు తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, నాయకులు చేపల హరి, నగేష్‌నాయుడు, జయరాం, లక్ష్మీనారాయణ, బాలాంజి నేయులు, పోతుల లక్ష్మీనరసింహులు, కడియాల కొండన్న, పరమేశ్వరన, పీఎల్‌ఎనమూర్తి, రాజారావు, లక్ష్మీనరసింహ, సంగా తేజస్విని, సరళ, నెట్టెం బాలకృష్ణ, ఇస్మాయిల్, ఓంకార్‌రెడ్డి, గోపాల్ గౌడ్, మారుతీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....