MLA : సొసైటీలను బలోపేతం చేయాలి : ఎమ్మెల్యే
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:43 AM
గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలను బలోపేతం చేయడానికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కృషిచేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. నూతనం గా ఎంపికైన మండలంలోని ప్యాదిండి గ్రామానికి చెందిన గొర్రెల పెంపకం దారుల సంఘం సభ్యులు సోమవారం వెంకటాపురంలో ఎమ్మెల్యేని మ ర్యాదపూర్వకంగా కలిశారు.
చెన్నేకొత్తపల్లి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలను బలోపేతం చేయడానికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కృషిచేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. నూతనం గా ఎంపికైన మండలంలోని ప్యాదిండి గ్రామానికి చెందిన గొర్రెల పెంపకం దారుల సంఘం సభ్యులు సోమవారం వెంకటాపురంలో ఎమ్మెల్యేని మ ర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ మండల కన్వీనర్ ముత్యాల్‌రెడ్డితో కలిసి సంఘం అధ్యక్షురాలు గంగమ్మ, ఉపాధ్యక్షుడు పోతలయ్య, డైరెక్టర్‌లు ము రళి, రమేశ, లక్ష్మీనరసమ్మ, ఉమాదేవి, రామచంద్ర తదితరులు ఉన్నారు. నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపీ పీ ప్రసాదమ్మ, టీడీపీ నాయకులు చందమూరు ప్రభాకర్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....