LAHARI : అట్టహాసంగా సిల్వర్ జుబ్లీ వేడుకలు
ABN , Publish Date - Jan 27 , 2025 | 12:23 AM
లహరీ డ్యాన్స, ఫిట్నెస్ అకాడమీ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణమండపంలో అట్టహాసంగా నిర్వహించారు. సినీ హీరో సంపూర్ణేష్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
అనంతపురం కల్చరల్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : లహరీ డ్యాన్స, ఫిట్నెస్ అకాడమీ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణమండపంలో అట్టహాసంగా నిర్వహించారు. సినీ హీరో సంపూర్ణేష్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనం తపురం వాసుల అభిమానం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, ఇక్కడివారికి ప్రేమాభిమానాలు ఎక్కువన్నారు. చిన్న, పెద్ద తేడా లే కుండా ప్రతిఒక్కరూ డ్యాన్సుల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారని, ఇందుకు లహరి డ్యాన్స ఫిట్నెస్ అకాడమీ వేదికగా నిలవడం అభినంద నీయమన్నారు. పలువురు కళాకారులను ఆయన చేతులమీదుగా సత్క రించారు. అనంతరం పలువురు నృత్యకారులు డ్యాన్సులతో అలరించా రు. అకాడమీ వ్యవస్థాపకుడు హరిప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నాట్యాచార్యురాలు సంధ్యామూర్తి, మాజీ మేయర్ రాగే పరశురాం దంపతులు, శ్రీనిధి రఘు, లంకాప్రసాద్, రమేష్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాట్యాచార్యులు, డ్యాన్స మాస్టర్లు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....