MLA : విజ్ఞాన విహార యాత్ర పోస్టర్ల విడుదల
ABN , Publish Date - Jan 20 , 2025 | 12:28 AM
లంకల గన్నవరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన గృహం సందర్శనకు సంబంధించి విజ్ఞాన విహార యాత్ర పోస్టర్లను ఆదివారం విడుదల చేశారు. నగరంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా విడు దల చేశారు.
అనంతపురం రూరల్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): లంకల గన్నవరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన గృహం సందర్శనకు సంబంధించి విజ్ఞాన విహార యాత్ర పోస్టర్లను ఆదివారం విడుదల చేశారు. నగరంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా విడు దల చేశారు. ఈ సందర్భంగా చియ్యేడు జిల్లా పరిషత పాఠశాల ఉపాధ్యా యులు మాట్లాడుతూ... అనంతపురం జిల్లా నుంచి ఐదుగురు, శ్రీసత్యసాయి జిల్లా నుంచి ఐదుగురు చొప్పున మొత్తం పది మందితో పాటు చియ్యేడు పాఠశాలలో పది పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన మొదటి ముగ్గురు విద్యార్థులకు తూర్పుగోదావరి జిల్లాలోని లంకల గన్నవరంలో ఉన్న డొక్కా సీతమ్మ నిత్యాన్నదాన నిలయం సందర్శనకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. డొక్కా సీతమ్మ గృహ సందర్శనకు తాను కూడా వస్తానని ఎమ్మెల్యే తెలిపారన్నారు. ఈకార్యక్రమంలో ఏపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాక్ష/లు కోనంకి అశోక్‌కుమార్, ఆకుతోటపల్లి టీడీపీ క్లస్టర్ ఇనచార్జ్ రాగేమురళీ మోహన, స్టోర్ డీలర్ మందల చంద్రశేఖర్, చియ్యేడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....