MLA : రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం : ఎమ్మెల్యే
ABN , Publish Date - Jan 20 , 2025 | 12:24 AM
రోటరీ క్లబ్ చేపడుతున్న సేవలు అభినందనీయ మని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సౌజన్యంతో అనంతపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం వంద మంది మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ చేశారు. అనంతపురం క్లబ్ ఆవరణలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మిషన్లను పంపిణీ చేశారు.
అనంతపురం కల్చరల్/ క్లాక్ టవర్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రోటరీ క్లబ్ చేపడుతున్న సేవలు అభినందనీయ మని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సౌజన్యంతో అనంతపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం వంద మంది మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ చేశారు. అనంతపురం క్లబ్ ఆవరణలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రో టరీ క్లబ్ సేవలు ఎన్నో కుటుంబాలకు ఉపయోగపడుతున్నాయన్నారు. జిల్లా సర్వజనాస్పత్రి వద్ద కూడా రోటరీ క్లబ్ సేవలు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అనంతపురం అధ్యక్షుడు భవాని రవికుమార్, కార్యదర్శి గల్లా హర్ష, సభ్యులు మేడా అర వింద్, తస్కిన కౌర్, టీడీపీ రాష్ట్ర నాయకుడు గంగారామ్, పద్మశాలి ఫెడ రేషన డైరెక్టర్ లక్ష్మీనరసింహులు, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి ముక్తి యార్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీనరసింహ, బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దలవాయి వెంకటరమణ, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....