Share News

STONE BEAM: రాతిదూలం లాగుడు పోటీలు

ABN , Publish Date - Mar 09 , 2025 | 12:30 AM

మండలంలోని అయ్యవారిపల్లిలో ఎర్రితాతస్వామి పరుష సందర్భంగా శనివారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఆలయం వద్ద నిర్వహించిన పోటీలకు పలు ప్రాంతాల నుంచి వృషభాలు హాజరయ్యాయి.

STONE BEAM: రాతిదూలం లాగుడు పోటీలు
Bulls pulling a stone beam

రాప్తాడు, మార్చి 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని అయ్యవారిపల్లిలో ఎర్రితాతస్వామి పరుష సందర్భంగా శనివారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఆలయం వద్ద నిర్వహించిన పోటీలకు పలు ప్రాంతాల నుంచి వృషభాలు హాజరయ్యాయి. ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన రైతు చెన్నప్ప వృషభాలు మొదటి బహుమతి రూ. 25 వేలు గెలుపొందాయి. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మద్దెల చెరువుకు చెందిన రైతు కొండయ్య వృషభాలు రెండో బహుమతి రూ. 20 వేలు గెలుపొందాయి. బహుమతులను టీడీపీ మండల కన్వీనర్‌ కొండప్ప, రాప్తాడు సీఐ శ్రీహర్ష చేతుల మీదుగా అందజేశారు. పరుష సందర్బంగా ఆలయం వద్ద అన్నదానం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఎర్రితాతస్వామిని దర్శించుకుని రాతి దూలం పోటీలను ఆసక్తిగా తిలకించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 09 , 2025 | 12:30 AM