TEACHERS : జాబితాలో అభ్యంతరాలు తొలగించండి
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:24 AM
టీచర్ల సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలు తొలగించాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. ఆ సంఘం నాయకులు శనివారం సైన్స సెంటర్ లో డీఈఓను కలిశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గోవిందరాజు, ప్రధానకార్యదర్శి లింగమయ్య, ఇతర నేతలు మాట్లాడుతూ...జాబితాల్లో కొందరు టీచర్ల పేరు కనిపించడంలేదన్నారు.

- డీఈఓకు వినతుల వెల్లువ
అనంతపురం విద్య, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : టీచర్ల సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలు తొలగించాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. ఆ సంఘం నాయకులు శనివారం సైన్స సెంటర్ లో డీఈఓను కలిశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గోవిందరాజు, ప్రధానకార్యదర్శి లింగమయ్య, ఇతర నేతలు మాట్లాడుతూ...జాబితాల్లో కొందరు టీచర్ల పేరు కనిపించడంలేదన్నారు. టిస్ డేటాకు భిన్నంగా లిస్టులో వివరాలు ఉన్నాయ న్నారు. సీనియారిటీలో వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. చాలా మంది సీనియ ర్ల కంటే జూనియర్లు ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. టీచర్ల హాల్ టికెట్లు, మార్కులు, ర్యాంకులు, రోస్టర్ తదితర వివరాలు తెలియకపోవడం వల్లే ఇలాంటి తప్పులు ఎక్కువ జరిగి ఉంటాయన్నారు. తప్పులు సవరించాలని కోరారు. ఈ మేరకు డీఈఓకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆసంఘం నాయకులు రమణయ్య, చంద్రమోహన, నాగేంద్ర, ఆదిశేషయ్య, పవనకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎల్‌టీఏ నేతల వినతి : తెలుగు, హిందీ, కన్నడ, ఉర్దూ, సంస్కృతం టీచర్ల సీనియారిటీ జాబితాలో పొరపాట్లు ఉన్నాయని ఎస్‌ఎల్‌టీఏ, ఆపస్ నాయకులు డీఈఓకు తెలిపారు. ఈ మేరకు డీఈఓకు వినతిపత్రం అందిం చారు. కార్యక్రమంలో ఎస్‌ఎల్‌టీఏ జిల్లా అధ్యక్షుడు ఆదిశేషయ్య, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, తులసీదాస్, సాయిప్రసాద్, ఆపస్ నాయకులు రాజేంద్రప్రసాద్, ఎర్రిస్వామి, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.
డీడీఓలకు ఎడిట్ అవకాశం ఇవ్వాలి
ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో అనేక పొరపాట్లు ఉన్నాయని, చాలా గందరగోళం ఉందని, మరోసారి డీడీఓలకు ఎడిట్ ఆప్షన ఇవ్వాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య, ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 1994 నుంచి ఇప్పటి వరకూ జరిగిన డీఎస్సీల వారీగా ర్యాంకులు, రోస్టర్ మెరిట్ లిస్టుల ను డీఈఓ వెబ్‌సైట్‌లో ఉంచాలన్నారు. టీచర్లు అనంతపురానికి వచ్చి తప్పు ల సవరణకు వినతులు ఇవ్వడం ఇబ్బందిగా మారిందన్నారు. వినతులు ఇవ్వడానికి సత్యసాయి జిల్లాలోనూ కౌంటర్లు ఏర్పాటుచేయాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....