GOD : నీలకంఠుడికి రావణ వాహన సేవ
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:04 AM
మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం దశకంఠ రావణ బ్రహ్మ వాహనం పై శివపార్వతులు ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆల యంలో ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు.
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం దశకంఠ రావణ బ్రహ్మ వాహనం పై శివపార్వతులు ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆల యంలో ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం ఆలయంలోని శివలింగానికి విశేష అలంకరణ చేసి, ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో దీక్షాహోమం చేశా రు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన రావణబ్రహ్మ వాహనంపై స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి మొదటిరోడ్డు, రెండో రోడ్డుమీదుగా ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణలోని వేదికపై నృత్యకళాకారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో ఆ లయ ఈఓ రమేష్‌బాబు, అనువంశీకుడు హోసూరు రామ సుబ్రహ్మ ణ్యం, నరేంద్ర చౌదరి, శ్రీనివాసులు, ఎర్రిస్వామి, పరమేష్, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....