Share News

Ramana : రమణ.. లోడెత్తాడు..!

ABN , Publish Date - Feb 28 , 2025 | 12:43 AM

రమణారెడ్డి మందు కొట్టాడు. అదేం పెద్ద విశేషమా..? అలవాటు ఉన్న అందరూ కొడతారు.. అనుకోకండి. ఆయన మందు కొట్టిన ప్లేస్‌ వేరే..! అనంతపురం నడిబొడ్డున..! కోర్టు సముదాయాల ఎదుట..! టూటౌన, రూరల్‌, ట్రాఫిక్‌.. మూడు పోలీసు స్టేషనల ముందు బైకు నిలబెట్టి.. సైడ్‌ బ్యాగ్‌ నుంచి మద్యం బాటిల్‌, గ్లాసు ...

Ramana : రమణ.. లోడెత్తాడు..!
Ramana Reddy with a glass of alcohol

రమణారెడ్డి మందు కొట్టాడు. అదేం పెద్ద విశేషమా..? అలవాటు ఉన్న అందరూ కొడతారు.. అనుకోకండి. ఆయన మందు కొట్టిన ప్లేస్‌ వేరే..! అనంతపురం నడిబొడ్డున..! కోర్టు సముదాయాల ఎదుట..! టూటౌన, రూరల్‌, ట్రాఫిక్‌.. మూడు పోలీసు స్టేషనల ముందు బైకు నిలబెట్టి.. సైడ్‌ బ్యాగ్‌ నుంచి మద్యం బాటిల్‌, గ్లాసు బయటకు తీశాడు. అందులోకి మందు పోసి, వాటర్‌ ప్యాకెట్‌ను నోటితో కొరికి.. గ్లాస్‌లో పిండుకున్నాడు. ఈ దృశ్యాలను సెల్‌ఫోనలో బంధిస్తున్నవారికి ‘చీర్స్‌’ చెప్పి గట గటా తాగేసి, ఖాళీ గాసును అక్కడ పడేసి.. రూరల్‌ పోలీస్‌ స్టేషనలోకి వెళ్లిపోయాడు.

ఏమైంది రమణా..?

ఆర్‌డబ్ల్యుఎ్‌సలో రికార్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమణారెడ్డి, కుటుంబంతో కలిసి ఆలమూరు రోడ్డులోని పీవీకేకే కళాశాల ఎదుట నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య ఝాన్సీరాణి.. తన సోదరుడి పెళ్లి మార్చి 1, 2తేదీల్లో ఉండటంతో రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లారు.


పిల్లలను తనతోపాటు పంపకపోవడంతో గురువారం మరోసారి వచ్చి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. భర్త ఒప్పుకోకపోవడతో రూరల్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రమణారెడ్డిని పిలిపించారు. రూరల్‌ పోలీ్‌సస్టేషన వద్ద బైకును నిలబెట్టిన ఆయన.. మద్యం సేవించి విచారణను ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంపై రూరల్‌ పీఎస్‌ కానిస్టేబుల్‌ మనోహర్‌.. టూటౌనలో స్పెషల్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. కేసు నమోదు చేశామని సీఐ శ్రీకాంత తెలిపారు.

- ఆంధ్రజ్యోతి, అనంతపురం క్రైం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Feb 28 , 2025 | 12:43 AM