GOD : ఘనంగా రాఘవేంద్రస్వామి జన్మతిథి
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:48 AM
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి జన్మతిథిని పురస్కరించు కుని గురువారం మొదటి రోడ్డు లోని రాఘవేంద్రస్వామి మఠం లో వేడుకలను భక్తిశ్రద్ధ లతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి బృందావనా న్ని వివిధ రకాల పుష్పాలతో న యనమనోహరంగా అలంకరిం చారు.
అనంతపురం కల్చరల్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : మంత్రాలయ రాఘవేంద్ర స్వామి జన్మతిథిని పురస్కరించు కుని గురువారం మొదటి రోడ్డు లోని రాఘవేంద్రస్వామి మఠం లో వేడుకలను భక్తిశ్రద్ధ లతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి బృందావనా న్ని వివిధ రకాల పుష్పాలతో న యనమనోహరంగా అలంకరిం చారు. పుష్పార్చన, విశేష పూజ లు నిర్వహించారు. భక్తులు వందలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. మహా మంగళహారతి నివేదనానంతరం మధ్యాహ్నం అన్నదానం చేశారు. కార్యక్రమంలో మఠం మేనేజర్ కోటేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....