Share News

COLLECTOR : వేగంగా పీఎం సూర్య ఘర్‌

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:42 AM

జిల్లాలో పీఎం సూర్య ఘర్‌ పథకం అమలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేఎనటీయూ రోడ్డులోని విద్యుత్తు శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌బజిలీ యోజన, పీఎం కుసుమ్‌ తదితర వాటిపై విద్యుత్తు అధికారులతో ఆయన సమీక్షించారు.

COLLECTOR : వేగంగా పీఎం సూర్య ఘర్‌
Collector Vinod Kumar and MP Ambika speaking in the meeting

- 45 రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలి : కలెక్టర్‌

అనంతపురం రూరల్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీఎం సూర్య ఘర్‌ పథకం అమలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేఎనటీయూ రోడ్డులోని విద్యుత్తు శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌బజిలీ యోజన, పీఎం కుసుమ్‌ తదితర వాటిపై విద్యుత్తు అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పీఎం సూర్య ఘర్‌ పథకానికి 46,782 దరఖాస్తులు వచ్చాయన్నారు. అందులో 2,752దరఖాస్తులు వెండర్స్‌ను ఎంపిక చేసుకోగా, 54 దరఖాస్తులు పరిశీలన పెండింగ్‌లో ఉంద న్నారు. అలాగే 308మందికి సబ్సిడీ జమ అయినట్లు తెలిపారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని 45రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఏఈ రోజుకో దరఖాస్తును పూర్తి చేయాలన్నారు.


మంజూరైన ప్రాజెక్టులు గ్రౌండింగ్‌ కావాలన్నారు. ఇళ్లపై సోలార్‌ ప్యానల్‌ బిగించడం చేయాలన్నారు. సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటుకు అవసరమైన పరికరాలను వెండర్స్‌ సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తు ఏస్థాయిలో ఉందో ఆనలైన పోర్టల్‌లో కనిపించేలా చూడాలన్నారు. ఫీడర్‌ లెవల్‌ పోలారైజేషన స్కీమ్‌కు సంబంధించి సబ్‌స్టేషన పక్కన 50ఎకరాల భూమి చూపించాల్సి ఉందని ఇందుకు భూమిని గుర్తించాలన్నారు. ఎంపీ అంబికా మాట్లాడుతూ పథకం అమలులో జిల్లాని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు పని చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్తు శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌, ఎల్‌డీ ఎం నర్సింగరావు, ఈఈలు, ప్రసాద్‌, జేవీ రమేష్‌, రాజశేఖర్‌, రవిశంకర్‌, డీఈఈలు శ్రీనివాసులు, గురురాజు, ప్రభాకర్‌రావు, శ్రీనివాసులు నాయుడు, చంద్రశేఖర్‌, సాయి శంకర్‌, వెంకటసుబ్బయ్య, ఏఈలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 06 , 2025 | 12:42 AM