Share News

ROAD : ప్రమాదాలకు నిలయంగా పుట్టకనుమ ఘాట్‌ రోడ్డు

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:58 PM

మండలంలోని పుట్ట కనుమ ఘాట్‌రోడ్‌ ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. భానుకోట గ్రామ సమీపంలో పుట్టకనుమ ఘాట్‌రోడ్‌ ఉంది. ఈ రహ దారి గుండా ప్రతిరోజు వందలు వాహనాలు ధర్మవరం, తరగరకుంట, కళ్యాణదుర్గం మీదుగా వెళుతుంటాయి. ఘాట్‌రోడ్డు వద్దకు రాగానే వాహనదారులు ప్రమాదాలకు గురై ఆసుపత్రుల పాలవుతున్నా రు.

ROAD : ప్రమాదాలకు నిలయంగా పుట్టకనుమ ఘాట్‌ రోడ్డు
A dangerous turn

కనగానపల్లి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని పుట్ట కనుమ ఘాట్‌రోడ్‌ ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. భానుకోట గ్రామ సమీపంలో పుట్టకనుమ ఘాట్‌రోడ్‌ ఉంది. ఈ రహ దారి గుండా ప్రతిరోజు వందలు వాహనాలు ధర్మవరం, తరగరకుంట, కళ్యాణదుర్గం మీదుగా వెళుతుంటాయి. ఘాట్‌రోడ్డు వద్దకు రాగానే వాహనదారులు ప్రమాదాలకు గురై ఆసుపత్రుల పాలవుతున్నా రు. మలుపు ఎక్కువగా ఉండటం, వనవే కావడంతో పాటు, వర్షాలకు రోడ్డు ఇరువైపులా కోతకు గురైంది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా రాత్రివేళల్లో జరుగుతున్నాయని, ఇందుకు ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం కూడా కారణమంటు న్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేసి, సూచికా బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 16 , 2025 | 11:58 PM