Share News

MLA : సైకో ప్రకాష్‌రెడ్డీ... నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలా..?

ABN , Publish Date - Mar 09 , 2025 | 12:12 AM

సైకో ప్రకాష్‌రెడ్డీ.. అధికారంలో ఉన్నప్పుడు పేరూరు ప్రాజెక్టుకు నీరు ఇచ్చే పనులు చేయకుం డా ఇప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా..? అని ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. శనివారం అనంతపురం నగరంలోని ఆమె క్యాంప్‌ కార్యాలయంలో రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్‌ మండలాలకు చెందిన 30 మందికి రూ.33.32 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పరిటాల సునీత అందజేశారు.

MLA : సైకో ప్రకాష్‌రెడ్డీ... నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలా..?
MLA Paritala Sunitha distributed CMRF cheques to the poor

- ఎమ్మెల్యే పరిటాల సునీత

అనంతపురం అర్బన, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): సైకో ప్రకాష్‌రెడ్డీ.. అధికారంలో ఉన్నప్పుడు పేరూరు ప్రాజెక్టుకు నీరు ఇచ్చే పనులు చేయకుం డా ఇప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా..? అని ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. శనివారం అనంతపురం నగరంలోని ఆమె క్యాంప్‌ కార్యాలయంలో రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్‌ మండలాలకు చెందిన 30 మందికి రూ.33.32 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పరిటాల సునీత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... పేదలకు కష్టం ఉందంటే, క్షణం కూడా ఆలోచించకుండా సీఎం చంద్రబాబు సాయం చేస్తున్నారన్నారు. రేషనకార్డులు, కొత్త పింఛన్ల ఇప్పించాలని ప్రజలు కోరుతున్నారని, ఈ విషయంపై సంబంధిత మంత్రిని కలిశామన్నా రు. త్వరలోనే కొత్తవి అందిస్తామన్నారు. ఇదే క్రమంలో తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు.


నోరు ఉందని, చేతిలో సెల్‌ ఫోన ఉందని ఏదిబడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. గత ఐదేళ్లల్లో పేరూరు ప్రాజెక్టును అటకెక్కించారన్నారు. వర్షపు నీటితో నిండిన ప్రాజెక్టు గేట్లను అవగాహనరాహిత్యంతో ఎత్తి, వాటిని విరగొట్టి మొత్తం నీటిని ఏటిపాలు చేశావన్నారు. అటువంటి నీవా ఈ రోజు నీతి వాఖ్యాలు వల్లించేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజు... ఒక మహిళగా చెబుతున్నాను... పేరూరు ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయిం చి, ప్రాజెక్టుకు నీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. పేదలకు ఇళ్లు నిర్మిస్తామంటూ రాక్రీట్‌ సంస్థ పేరుతో దో పిడీ చేసింది నిజం కాదా అని నిలదీశారు. సొంతింటి కల నెలవేర్చుకోవలని ఎదురుచూస్తున్న పేదలను మోసం చేశారన్నారు. తాము ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు కచ్చితంగా ఇళ్లు మంజూరు చేసి తీరుతామన్నారు. ప్రకాష్‌రెడి అవినీతి లెక్కలు కూడా త్వరలోనే తేలుతాయని ఎమ్మెల్యే పరిటాల సునీత స్పష్టం చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 09 , 2025 | 12:12 AM