ABN Effect on Sri Satyasai: ఏబీఎన్ ఎఫెక్ట్.. సచివాలయంలో ఆ ఫొటోల తొలగింపు.!
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:01 PM
కదిరి మండలంలోని ఓ సచివాలయంలో గత ప్రభుత్వానికి సంబంధించిన ఫొటోలు ఉండటంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఇటీవల వార్త ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు.. వెంటనే వాటిపై చర్యలు చేపట్టారు.
అనంతపురం జిల్లా, డిసెంబర్ 20: శ్రీ సత్యసాయి(Sri Satyasai) జిల్లాలోని ఓ గ్రామ సచివాలయంలో గత ప్రభుత్వానికి సంబంధించిన ఫొటోలు ఉండటంపై ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి(ABN Andhrajyothy)లో ఓ కథనం ప్రచురితమైంది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు.
ఏమైందంటే?
కదిరి(Kadiri) మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామ సచివాలయంలో మాజీ సీఎం జగన్ నవరత్నాలకు సంబంధించిన ఫొటోలు కనిపించాయి(Kammaravandlapalli). ఈ విషయాన్ని పసిగట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ప్రభుత్వం మారి ఏడాదిన్నర గడచినా పాత చిత్రాలు అలాగే ఉండటంపై ఇటీవల ఓ కథనం ప్రచురించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. వెంటనే స్పందించారు. ఆ సచివాలయంలో సదరు చిత్రాలను తొలగింపజేశారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు సచివాలయ కార్యదర్శులకు(Panchayat Secretary) కదిరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోలప్ప(MPDO Polappa) మెమో జారీ చేశారు.
ఇవీ చదవండి: