MLA : చెరువులు నింపాలని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ వినతి
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:50 AM
నియోజకవర్గంలోని చెరువులు నింపితే సాగు, తాగు నీ రు సమస్య తలెత్తకుండా ఉంటుం దని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే బుధవారం మంత్రి లోకేశను ఆయన నివాసంలో కలిసి నియోజకవర్గం సమస్యలపై వినతి పత్రం అందజే సినట్లు తెలిపారు.
శింగనమల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని చెరువులు నింపితే సాగు, తాగు నీ రు సమస్య తలెత్తకుండా ఉంటుం దని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే బుధవారం మంత్రి లోకేశను ఆయన నివాసంలో కలిసి నియోజకవర్గం సమస్యలపై వినతి పత్రం అందజే సినట్లు తెలిపారు. నియోజకవర్గం లోని మిడ్ పెన్నార్ డ్యాం సౌత కెనాల్ ఆధునికీకరణలో భాగంగా, బైపాస్ కాలువ పనులు పనులు పూర్తి చేస్తే చివరి ఆయకట్టు వరకు నీరు చేరుతుందన్నారు. జిల్లాలోనే అతిపెద్దదైన శింగనమల శ్రీరంగరాయ చెరువుకు టీఎంసీ నీరు కే టాయించారని, తూముల మర్మమ్మతులు చేస్తే నీటి నిల్వతో 40 గ్రా మాల్లో నీటి సమస్య తీరుతుందన్నారు. ఐదువేల ఎకరాలపైగా సాగు చేయవచని, 350 మంది మత్స్యకారులకు జీవనోపాధి కల్పించ వచ్చ న్నారు. అలాగే సుబ్బరాయచెరువు, గడికోట ఎత్తిపోతల పథకం పనుల కు బడ్జెట్‌లో నిఽధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....