YOGI VEMANA : చిరస్మరణీయం వేమన పద్యం
ABN , Publish Date - Jan 20 , 2025 | 12:32 AM
సరళమైన పదాలతో అందరి నోట తన పద్యాలు పలికించిన మహాకవి యోగివేమన అని కలెక్టరు డాక్టరు వినోద్‌కుమార్ కొనియాడారు. ఆయన పద్యాలు చిరస్మ రణీ యమన్నారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో యోగివేమన జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
జయంతి సందర్భంగా పలువురి ఘన నివాళి
అనంతపురం టౌన జనవరి19( ఆంధ్రజ్యోతి): సరళమైన పదాలతో అందరి నోట తన పద్యాలు పలికించిన మహాకవి యోగివేమన అని కలెక్టరు డాక్టరు వినోద్‌కుమార్ కొనియాడారు. ఆయన పద్యాలు చిరస్మ రణీ యమన్నారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో యోగివేమన జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు, జేసీ ఇతర అదికారులు, కవులు పెద్దఎత్తున పాల్గొని ఆయన చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కవి ఏలూరు యంగన్న, జేసీ శివనారాయణ శర్మ, డీఆర్‌ఓ మలోల, జిల్లా టూరిజం శాఖ అధికారి జయకుమార్, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, పౌరసంబంధాలశాఖ అధికారి గురుస్వామిశెట్టి, కవులు శ్రీనివాసరెడ్డి, మధురశ్రీ, కృష్ణమూర్తి, అప్పస్వామి, రామ్మోహన, రియాజుద్దీన, నబీరసూల్, రషీద్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
అనంతపురం కల్చరల్/ సెంట్రల్: దేశంలోనే తొలి సంఘ సంస్కర్త, యోగి వేమన అని యోగి వేమన రెడ్డి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. యోగివేమన జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న యోగి వేమన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, యోగివేమన రెడ్డి సేవాసంఘం నాయకులు ఆత్మారామిరెడ్డి, అనంత చంద్రారెడ్డి, బీఎస్‌ఎనఎల్ రాజశేఖర్‌రెడ్డి, కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేమన ఫౌండే షన ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌బీఎన కళాశాలలో వేమన చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. ఎస్కేయూ విశ్రాంత వీసీ హుసేనరెడ్డి, కేం ద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరినాథరెడ్డి, వేమన ఫౌండేషన అధ్యక్షుడు ఆచార్య రామకృష్ణారెడ్డి, విశ్రాంత ఆచార్యులు బయారెడ్డి, రవీంద్రారెడ్డి, సమాజ సేవకుడు కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. జేఎన్టీ యూలో వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వీసీ సుదర్శనరావు, రిజిస్ర్టార్ కృష్ణయ్య,, ఓఎస్టీ దేవన్నలు వేమన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు భానుమూర్తి, వైశాలి గోర్పాడే, ప్రిన్సిపాల్ చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....