Share News

Tragedy in Anantapur: ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహిత ఎంత పని చేసిందంటే..

ABN , Publish Date - Nov 08 , 2025 | 10:09 AM

అనంపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వివాహిత తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య గొడవ ఏడాదిన్నర చిన్నారిని ఒంటరిని చేసింది.

Tragedy in Anantapur: ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహిత ఎంత పని చేసిందంటే..
Tragedy in Anantapur

అనంతపురం, నవంబర్ 8: ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తంటి వేధింపులు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగంలో ఒత్తిడి ఇలా అనేక కారణాలతో నిండు నూరేళ్ల జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. బలవన్మరణానికి పాల్పడుతున్న వారిలో విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇప్పుడు తాజాగా అనంతపురంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.


నగరంలోని బుడ్డప్పనగర్‌లో వివాహిత స్వర్ణలత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన స్థానికులు వివాహితను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలు స్వర్ణలత, ఆమె భర్త రవికి మధ్య మనస్పర్థల కారణంగా తరచూ గొడవ జరుగుతున్నట్లు సమాచారం. కల్లూరి ప్రాంతానికి చెందిన ఈ దంపతులు ఏడాది క్రితమే నగరానికి వచ్చారు. వీరికి ఏడాదిన్నర పాప ఉంది.


కాగా.. గత రాత్రి దంపతుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్వర్ణలత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన వన్‌టౌన్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహిత ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఆఫ్రికన్ నత్తలతో ఆందోళన వద్దు..

ఏపీలో పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురు స్పాట్‌డెడ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 08 , 2025 | 11:53 AM