Share News

Road Accident: ఏపీలో పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురు స్పాట్‌డెడ్

ABN , Publish Date - Nov 08 , 2025 | 09:14 AM

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు.

Road Accident: ఏపీలో పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురు స్పాట్‌డెడ్
Road Accident

కిర్లంపూడి, నవంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై దూసుకెళ్ళింది. అన్నవరంలో పెళ్లి ముగించుకుని జగ్గంపేట తిరిగి వెళ్తుండగా కారు ఫ్రంట్ టైర్ పేలి పోవడంతో రెండు మోటర్ సైకిళ్లను, ఒక రిక్షాను కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిలో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. గాయలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.


స‌త్యసాయి జిల్లా త‌గ‌ర‌కుంటలో శనివారం ఉదయం విద్యార్థుల‌కు ప్రమాదం తప్పింది. స్కూల్ బ‌స్సు అదుపు తప్పి రోడ్డు ప‌క్కకు దూసుకెళ్ళింది. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 60 మంది స్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఎవ‌రికీ ఏమీ కాక‌పోవ‌డంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.


రెండు రోజుల క్రితం బాపట్ల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్లాక్‌ టవర్‌ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్‌.. లారీని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్‌ రిజ్వాన్‌ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్‌కి వెళ్లారు. అయితే బీచ్‌ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి 2.34 గంటల సమయంలో బాపట్ల గడియారం స్తంభం కూడలి వద్ద చీరాల నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అమాంతం ఎగిరిపడి ఘటనా స్థలంలోనే చనిపోయారు.


ఇవి కూడా చదవండి:

Lokesh: కార్యకర్తలు నడిపించే పార్టీ టీడీపీయే

Farming Technology: కిసాన్‌ డ్రోన్‌.. సాగు ఖర్చు డౌన్‌

Updated Date - Nov 08 , 2025 | 10:21 AM