Minister Payyavula : చూడండి సర్.. మీరిచ్చిన నీరు..!
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:16 AM
వజ్రకరూరు మండలంలోని రాగులపాడు వద్ద హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నుంచి 10 మోటార్లతో నీటిని పంపింగ్ చేసే వీడియోను సీఎం చంద్రబాబుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పంపించారు. ఈ వీడియోను చూసి సీఎం సంతోషం వ్యక్తం ...
వజ్రకరూరు మండలంలోని రాగులపాడు వద్ద హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నుంచి 10 మోటార్లతో నీటిని పంపింగ్ చేసే వీడియోను సీఎం చంద్రబాబుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పంపించారు. ఈ వీడియోను చూసి సీఎం సంతోషం వ్యక్తం చేసినట్లు మంత్రి శనివారం తెలిపారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి, 10 మోటార్లతో నీటి పంపింగ్ చేసేలా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హంద్రీనీవా కాలువలో పుష్కలంగా నీరు
వస్తోందని, ఇందుకు ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. అనంతపురం జిల్లాకు ఇంత పెద్ద ఎత్తున నీటిని తీసుకురావడం సంతోషంగా ఉందని సీఎం తనకు రిప్లై ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఆరు మోటార్ల నుంచి 12 మోటార్లను వాడుకునేలా కాలువ సామర్థ్యాన్ని రెండింతలు పెంచామని అన్నారు. ప్రస్తుతం కాలువలో రెండింతల సామర్థ్యంతో నీరు ప్రవహిస్తోందని అన్నారు.
- ఆంధ్రజ్యోతి, ఉరవకొండ
మరిన్ని అనంతపురం వార్తల కోసం..