FESTIVAL: భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:27 AM
కృష్ణాష్టమి వేడుకలను శనివా రం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో జగన్నాథ, సుభద్ర, బల రామ ప్రతిమలను ఇస్కాన ధర్మవరం ధర్మప్రచారకులు శ్రీకృష్ణ మాధవ దాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. చిన్నారులు రాధాకృష్ణులు, గోపికల వేషధారణలతో అలరించారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
కృష్ణాష్టమి వేడుకలను శనివా రం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో జగన్నాథ, సుభద్ర, బల రామ ప్రతిమలను ఇస్కాన ధర్మవరం ధర్మప్రచారకులు శ్రీకృష్ణ మాధవ దాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. చిన్నారులు రాధాకృష్ణులు, గోపికల వేషధారణలతో అలరించారు. పెద్దఎత్తున పట్టణ, గ్రామీణవాసులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. అలాగే ఇస్కాన సంస్థాపనాచార్యులు శ్రీల ప్రభుపాదుల ప్రతిమకు విశేషపూజలు చేశారు. అలాగే మండలంలోని గొట్లూరులో వెలసిన వేణుగోపాలస్వామి ఆలయం లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే ’స్థానిక లక్ష్మీ చెన్న కేశవస్వామి ఆలయం వద్ద ప్రబోధసేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృ ష్ణుడి ప్రతిమను ఏర్పాటుచేసి పూజలు చేశారు. యాదవవీధి, కొత్తపేట లోని గీతా మందిరంలో శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. భక్తులకు అన్నదానం చేశారు. కొత్తపేట గీతామందిరంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పూజలు చే యించారు. చెన్నకేశవస్వామి ఆలయంలో రుక్మిణీసమేత శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. కొత్తచెరువులోని గుప్తుల కాలంనాటి వేణు గోపాలస్వామి ఆలయంలో మూలవిరాట్‌కు అర్చకులు భాస్కర్‌రాజేశ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భజనలు చేశారు. ప్రబోధానంద సేవాసమితి వారు శ్రీకృష్ణుడి ప్రతిమను ఏర్పా టుచేసి పూజలు చేశారు. గాండ్లపెంట మండల వ్యాప్తంగా కృష్ణామి వేడు కలను ఘనంగా నిర్వహించా రు. వేపకుంట గ్రామంలో కృష్ణుడి విగ్రహాన్ని ఊరే గించారు. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషాధారణలో అల రించారు. బ త్తలపల్లి మండలవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నా రు. ఓబుళదేవరచెరువు మండల వ్యాప్తంగా కృష్ణాష్టమిని మండల వ్యా ప్తంగా నిర్వహించారు. అలాగే ప్రబోధ సేవా సమితి, ఇందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి ప్రతిమను గ్రామంలో ఊరేగించారు.
ముదిగుబ్బ: మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ప్రబో ధానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయించారు. పండుగలు మన సంప్రదాయాల గౌరవాన్ని నిలబెట్టడమే కాకుండా, సామాజిక ఐక్యతకు దోహదపడుతాయని మంత్రి పేర్కొన్నారు.
నల్లచెరువు: మండలకేంద్రంలోని గీతామందిరంలో శనివారం శ్రీకృష్ణుడి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యాలను సమరిం్పచారు. ఈ పూజలో ఎమ్మెల్యే కందికుంట వెంకటరప్రసాద్ హజరయ్యారు. ఎమ్యెల్యేని ఆలయ కమిటీ చైర్మన దాదెం శివారెడ్డి, కన్వీనర్ రాజశేఖర్‌బాబు దుశ్శాలువ, పూలమాలతో సన్మానించారు.
ధర్మవరం/కదిర అర్బన, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కొత్తపేటలో ఉన్న ఉషోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు చిన్నికృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. చిన్నారులతో ఉట్టికొట్టించడం, గోపి కలతో వెన్నచిలికించడం వంటి ఘట్టాలను నిర్వహించారు. అలాగే కదిరి పట్టణంలోని పట్టణంలోని షిర్డీసాయి హైస్కూల్‌లో. చిన్నారులు శ్రీకృష్ణుడు, బలరాముడు, రాధ, రుక్ష్మిణి, సత్యభామ, గోపికల వేషధారణలో హాజరయ్యారు. చిన్నారుల నృత్యాలు అలరించాయి.
నంబులపూలకుంట / ఓబుళదేవర చెరువు: నంబులపూలకుంట మండలకేంద్రంలోని కేజీబీవీలో బాలికలు గోపికల వేషాధారణలో అలరిం చారు. ఓబుళదేవరచెరువు మండల వ్యాప్తంగా కృష్ణాష్టమిని మండల వ్యా ప్తంగా నిర్వహించారు. మండలకేంద్రంలోని వశిష్ట, జ్ఞానసాయి, విజ్ఞాన, శ్రీవిజ్ఞాన, రెయినబో పాఠశాలల్లో గోపికలు, కృష్ణుడి వేషధారణలో చిన్నా రులు అలరించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....