ICDS : మహిళల ఉజ్వల్ భవిష్యత్తుకు కిశోరి వికాసం
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:30 AM
బాలికలు, మహిళల ఉజ్వల్ భవిష్యత్తుకు కిశోరి వికాసం కార్యక్రమం ఎంతోగానో దోహపడుతుందని ఐసీడీఎస్‌ఐ పీడీ వనజాక్కమ్మ పేర్కొన్నారు. గార్లదిన్నెలో కిశోరి వికాసం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ పీడీ వనజా అక్కమ్మ ముఖ్య అథితులుగా హజరైమాట్లాడారు.

ఐసీడీఎస్‌ఐ పీడీ వనజా అక్కమ్మ
గార్లదిన్నె, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : బాలికలు, మహిళల ఉజ్వల్ భవిష్యత్తుకు కిశోరి వికాసం కార్యక్రమం ఎంతోగానో దోహపడుతుందని ఐసీడీఎస్‌ఐ పీడీ వనజాక్కమ్మ పేర్కొన్నారు. గార్లదిన్నెలో కిశోరి వికాసం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ పీడీ వనజా అక్కమ్మ ముఖ్య అథితులుగా హజరైమాట్లాడారు. అడపిల్లల ఉజ్వలమైన, ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు కిశోరి వికాసం కార్యక్రమం పున:ప్రారంభం పునాది వేస్తుందన్నారు. ముఖ్యంగా బాలికలు ఎదుర్కొనే ఇబ్బందులు, బాల్య వివాహాల నివారణ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బడిమానేసిన పిల్లలను బడిలో చేర్పించాలని తెలిపారు. ఈఓఆర్డీ దామోదరమ్మ, ఎంఈఓ మల్లికార్జుననాయక్, సీడీపీఓ ఉమా శంకరమ్మ, ఏపీఎం మల్లికార్జున, ఆర్‌డబ్ల్యూఎస్ మండల కోఆర్డినేటర్ అనురాధ, ఐసీడీఎస్‌ఐ సూపర్ వైజర్లు జ్యోతి, వాణిశ్రీ, వీఆర్వోలు, వెలుగు సీసీలు, ఆంగనవాడీ వర్కర్లు, ఆయాలు, ఏఎనఎంలు పాల్గొన్నారు.
కిశోరి వికాసంతో మరింత అభివృద్ధి : సీడీపీఓ
అనంతపురం విద్య, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : కిశోర బాలికల వికా సంతోనే సమాజాభివృద్ధి మరింత సాధ్యమని అనంతపురం అర్బన ప్రాజ క్టు సీడీపీఓ లలిత పేర్కొన్నారు. నగర శివారులోని మహిళా ప్రాంగణం లో సోమవారం అర్బన ప్రాజక్టు పరిధిలోని 3,4 సెక్టార్లలో అంగనవాడీ వర్కర్లు, సచివాలయ మహిళా పోలీసులు, హెల్త్ సెక్రెటరీలకు కిశోరి వికాసం కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి హాజరై సీడీపీఓ మాట్లాడుతూ... ఆత్మరక్షణ, డిజిటల్ భద్రత, సైబర్ క్రైం, ఆనలైన వేదికల పై బాలికలు జాగ్రత్తగా ఉండేట్లు అవగాహన కల్పించాలని సూచించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు టీచర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....