MERIT : డీఎంఎల్‌టీ పరీక్షల్లో మెరిసిన కావ్య
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:57 AM
డిప్లొమా ఇన మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (పారా మెడికల్) పరీక్షల పలితాల్లో అనంతకు చెందిన కావ్య రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. అనంత మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని కావ్య 480కిగాను 416మార్కులతో టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది.

అనంతపురంటౌన, మార్చి6 (ఆంధ్రజ్యోతి): డిప్లొమా ఇన మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (పారా మెడికల్) పరీక్షల పలితాల్లో అనంతకు చెందిన కావ్య రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. అనంత మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని కావ్య 480కిగాను 416మార్కులతో టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది. విద్యార్థినిని గురువారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మాణిక్యాలరావు, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ శంషాద్‌బేగం, డాక్టర్ షారోన సోనియా అభినందించారు.
సీడ్స్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
డీఎంఎల్‌టీ పరీక్షల్లో సీడ్స్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. కళాశాలకు చెందిన హాజీమస్తాన వలి, జోగివీణ, షేక్ అసిఫ్ రాష్ట్రస్థాయిలో 2, 3, 4 ర్యాంకులు సాధించారని కరస్పాండెంట్ రంగనాయకులు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....