Td[p : మాట తప్పడం వైసీపీకే చెల్లు
ABN , Publish Date - Mar 03 , 2025 | 12:46 AM
తప్పుడు మాటలు చెప్పే సంస్కృతి కూటమి ప్రభుత్వానికి లేదని, మాట తప్పడం.. మడమ తిప్పడం వైసీపీకే చెల్లు అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ...
ఐదేళ్లలో ప్రాజెక్టులకు పైసా ఇవ్వలేదు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్
అనంతపురం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): తప్పుడు మాటలు చెప్పే సంస్కృతి కూటమి ప్రభుత్వానికి లేదని, మాట తప్పడం.. మడమ తిప్పడం వైసీపీకే చెల్లు అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, సీనియర్ నాయకుడు ముంటిమడుగు కేశవరెడ్డితో కలిసి వెంకటశివుడు యాదవ్ మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో ఏనాడైనా ప్రాజెక్టులకు ఒక్క పైసా విదిల్చారా..? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారిగా పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రాజెక్టులకు
వేలకోట్లు నిధులు కేటాయించిన విషయాన్ని మరిచిపోయి అనంత వెంకటరామిరెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హోదాలో పయ్యావుల కేశవ్ చొరవను అభినందించాలని వైసీపీకి హితవు పలికారు. వైసీపీ మాదిరిగా తప్పుడు మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం దగా చేయలేదన్నారు. రాయలసీమకు అన్యాయం చేసింది జగనరెడ్డే అన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అమలుకు నోచుకున్నాయంటే అది తెలుగుదేశం హయాంలోనే అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతిఒక్కరకి లబ్ధి చేకూరుతుందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కేంద్రంతో కలిపి ఏడాదికి రూ. 20వేలు త్వరలో అందించబోతున్నామన్నారు. వైసీపీ పాలనలో కేంద్రం సొమ్ముతో కలిపి రూ. 13,500 ఇస్తే... తమ ప్రభుత్వం రూ. 20 వేలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. మీ హయాంలో వారికి డీఏలు, ఐఆర్‌లు ఇచ్చారా..? ఎవరు మోసం చేశారో అందరికి తెలుసు అన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....