COLLECTOR : క్రమబద్ధీకరణ పథకం కింద ఇంటి పట్టా
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:34 AM
ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమ బద్ధీకరణ పథకం కింద ఇంటి పట్టా మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆయన గురువారం మండలంలోని కక్కలపల్లి పరిధిలో క్రమబద్ధీకరణ పథకం-2025 కింద దర ఖాస్తు చేసుకున్న మేకల మేరి అనే మహిళ ఇంటికి వెళ్లి నేరుగా పరిశీలిం చారు.

కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం రూరల్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమ బద్ధీకరణ పథకం కింద ఇంటి పట్టా మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆయన గురువారం మండలంలోని కక్కలపల్లి పరిధిలో క్రమబద్ధీకరణ పథకం-2025 కింద దర ఖాస్తు చేసుకున్న మేకల మేరి అనే మహిళ ఇంటికి వెళ్లి నేరుగా పరిశీలిం చారు. ఆమె మాట్లాడుతూ.. 72.6చదరపు గజాల లో ఇల్లు నిర్మించుకున్నట్లు కలెక్టర్‌కు తెలి పింది. కుటుంబ వార్షిక ఆదాయ వివరాలను, కుటుంబ సభ్యుల వివారాలను కలెక్టర్ అడిగితెలుసు కున్నారు. 150చదరపు గజాల ప్రభుత్వ స్థలానికి పైబ డి ఆక్రమించుకుని, నివాసం ఏర్పచుకుని ఉంటే అలాంటి వారు 15శాతం నుంచి 200శాతం వరకు మార్కెట్ ధరను చెల్లిస్తే క్రమబద్ధీకరణ చేస్తామని కలెక్టర్ తెలిపా రు. అబ్ధిదారులాలి దరఖాస్తును, ఫారం-2 లో పేర్కొన్న వివరాలన్నింటిని కలెక్టర్ అక్కడిక్కడే వీఆర్‌ఓతో నమోదు చే యిం చారు. తాము అన్ని విధాల పరిశీలించామ ని, నిబంధనల మేరకు భూమి ఉందని తహసీల్దార్ వివరించారు. గ్రామంలోని సబ్‌డివిజన చేసిన తర్వాతనే క్రమబద్ధీకర ణ చేయాల్సి ఉంటుందని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆర్డీఓ కేశనాయుడు, తహసీల్దార్ మోహనకుమార్, పంచాయితీ కార్యదర్శి హిదయతుల్లా తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....