WOMEN'S DAY: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ABN , Publish Date - Mar 08 , 2025 | 11:55 PM
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహిం చారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలతో పాటు వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేక్‌కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహిం చారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలతో పాటు వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేక్‌కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సన్మానించారు. మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. మహిళాశక్తి గొప్ప తనం, మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాల్సిన ఆవస్యకత గురించి ఆయా కార్యక్రమాల్లో వక్తలు ప్రసంగించారు. మండలకేంద్రాల్లోనూ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
టీడిపీతోనే మహిళల ఆర్థికాభివృది : ఎమ్మెల్యే శ్రావణిశ్రీ
శింగనమల, మార్చి 8(ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించగలరని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనంతపురం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళలు, మహిళా ఉపాధ్యాయుల తో కలిసి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, టీడీపీ నాయకురాలు బండారు లీలావతి కేక్ కట్ చేసి మహిళలకు శుభాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ మహిళల అభివృద్ధికి బాటలు వేసింది టీడీపీనే అన్నారు. పొదుపు సంఘాలతోనే మహిళల అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అమ్మలదిన్నె షాలినిదొర, ఉపాధ్యాయులు, మహిళలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....