Re-verification: రీ వెరిఫికేషనలో మాయగాళ్లు..!
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:26 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ ధ్రువ పత్రాలతో దివ్యాంగుల పింఛన్లు తీసుకుంటున్న మోసగాళ్ల ఆటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నకిలీ పింఛన్లకు వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డూ అదుపు లేకుండా పోయింది. తమపార్టీ వారని అప్పటి ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయడంతో డాక్టర్లు ధ్రువపత్రాలు ఇచ్చేశారు. ఇదే అదనుగా కొందరు దళారీలు డాక్టర్లను బుట్టలోకి వేసుకొని డబ్బులిచ్చి నకిలీ వైకల్య ధ్రువపత్రాలను ...

డాక్టర్లకు నకిలీల మస్కా
బయట ఒకరు బయోమెట్రిక్..
లోపలికి మరొకరు హాజరు
ఆర్థో పరీక్షల్లో నకిలీవ్యక్తి గుర్తింపు.. పరుగులు
డీసీహెచఎ్‌సకు డాక్టర్ల ఫిర్యాదు
అనంతపురం టౌన, మార్చి 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ ధ్రువ పత్రాలతో దివ్యాంగుల పింఛన్లు తీసుకుంటున్న మోసగాళ్ల ఆటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నకిలీ పింఛన్లకు వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డూ అదుపు లేకుండా పోయింది. తమపార్టీ వారని అప్పటి ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయడంతో డాక్టర్లు ధ్రువపత్రాలు ఇచ్చేశారు. ఇదే అదనుగా కొందరు దళారీలు డాక్టర్లను బుట్టలోకి వేసుకొని డబ్బులిచ్చి నకిలీ వైకల్య ధ్రువపత్రాలను విచ్చలవిడిగా చేయించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల సొమ్ము పెంచారు. ఇదే సమయంలో అర్హులకు మాత్రమే పింఛన్లు అందాలని, నకిలీలను ఏరివేయాలని ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఆదేశించారు. దీంతో దివ్యాంగుల వైకల్య సర్టిఫికెట్ల రీవెరిఫికేషనకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియకు జిల్లా డాక్టర్లతో కాకుండా ఇతర
జిల్లాల డాక్టర్లను నియమించారు. ఇప్పటికే రూ. 15 వేలు పింఛన తీసుకుంటున్న లబ్ధిదారుల రీవెరిఫికేషన పూర్తిచేశారు. ప్రస్తుతం రూ.6వేలు పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల వైకల్య సర్టిఫికెట్లను రీవెరిఫికేషన చేస్తున్నారు. జిల్లా సర్వజన ఆసుపత్రిలో ఇది కొనసాగుతోంది.
బయట ఒకరు.. లోపలికి మరొకరు
నకిలీ వైకల్య సర్టిఫికెట్లతో పింఛన తీసుకుంటున్న వారు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎవరి ఊహలకూ అందని మాయచేస్తూ వెరిఫికేషనకు వచ్చిన డాక్టర్లను తికమక పట్టిస్తున్నారు. రీవెరిఫికేషన సెంటర్‌కు వచ్చిన దివ్యాంగులను బయటే బయోమెట్రిక్ తీసుకొని లోపలికి పంపుతున్నారు. బయోమెట్రిక్ వేసిన తర్వాత అతడి స్థానంలో వైకల్యం ఉన్న మరొకరు లోపలికి వెళ్లికూర్చుంటున్నారు. డాక్టరు వద్దకు ఒరిజనల్ దివ్యాంగులు పోతుండడంతో పరిశీలించి వైకల్యం ఉందని ఆమోదం తెలిపి పంపుతున్నారు. ఇలా మాయగాళ్లు డాక్టర్లను మోసం చేస్తున్నారని బుధవారం డీసీహెచకు ఓ డాక్టర్ ఫిర్యాదు చేయడంతో వెలుగులోకివచ్చింది. ఓ వ్యక్తి పీహెచ కింద డాక్టర్ వద్దకు వెళ్లాడు. డాక్టరు ఆయనను పరీక్షిస్తుండగా వయసు 36 ఏళ్లు ఉండాలి కానీ ఎక్కువ ఉన్నట్లు అనుమానం వచ్చింది. ఆధార్, వైకల్య సర్టిఫికెట్ అడగడంతో అక్కడి నుంచి వేగంగా తప్పించుకుని వెల్లిపోయాడు. వారం క్రితం కూడా అంధత్వ వైకల్య రీవెరిఫికేషనలోనూ ఇలాగే ఇద్దరు.. బయట ఒకరు బయోమెట్రిక్‌వేసి లోపలికి ఇంకొకరు వెళ్లి ఆమోదం వేయించుకున్నట్లు డీసీహెచకు ఫిర్యాదులు వచ్చాయి.
ఈ మాయ ఎవరిది..?
నకిలీ వైకల్య సర్టిఫికెట్లను ఏరివేయాలని ప్రభుత్వం పగడ్బందీగా రీవెరిఫికేషన కొనసాగిస్తోంది. ఇపుడు నకిలీలు అధికారులు, డాక్టర్లను మస్కా కొట్టించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతటివారైనా రీవెరిఫికేషనలో విధులు నిర్వర్తిన్న వారి అండదండలు ఉంటేనే ఇలాంటి వ్యవహారాలు సాధ్యమవుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కళ్యాణదుర్గం ప్రాంతంలోని ఓ పీహెచసీలో పనిచేస్తున్న డాక్టర్ తనకు రూ.20 వేలు ఇస్తే వైకల్య సర్టిఫికెట్లను రీవెరిఫికేషనలో ఓకే చేయిస్తానని వ్యాపారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది, దళారులు, డీఆర్‌డీఏ ఉద్యోగులు కుమ్మక్కై ఈ అక్రమాలకు తెరలేపారన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే మోసగాళ్లు రెచ్చిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మోసాలపై ఫిర్యాదులు వాస్తవమే
వైకల్య సర్టిఫికెట్ల రీవెరిఫికేషనలో కొందరు చేస్తున్న మోసాలపై ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమే. బయట బయోమెట్రిక్ ఒకరు వేసి లోపలికి మాత్రం వైకల్యం ఉన్న వారు వెళ్లి డాక్టరుతో ఆమోదం వేయించుకుంటున్నారు. వారం క్రితం అంధత్వ సర్టిఫికెట్ల రీవెరిఫికేషనలో ఇద్దరు ఇలాగే చేశారని ఫిర్యాదు రావడంతో విచారణ చేయిస్తున్నాం. తాజాగా బుధవారం ఆర్థో(పీహెచ) వైకల్య సర్టిఫికెట్ రీవెరిపికేషనకు బయట బయోమెట్రిక్ వేసి లోపలికి ఇంకొకరు వెళ్లారు. డాక్టర్‌కు వయసుపై అనుమానం వచ్చి అడగడంతో తప్పించుకొని వెళ్లాడు. రాష్ట్ర అధికారుల దృష్టికి తీసికెళ్లాను. డాక్టర్ వద్ద కూడా బయోమెట్రిక్ తీసుకోవాలని చెప్పారు. ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఎవరి పాత్ర ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటాం.
- డాక్టర్ రవికుమార్, డీసీహెచఎ్‌స
మరిన్ని అనంతపురం వార్తల కోసం....