Share News

Suicide : నువ్వు రాకుంటే చచ్చిపోతా..!

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:51 AM

నగరపాలక సంస్థ పరిధిలోని ఆరో సచివాలయం ప్లానింగ్‌ సెక్రటకరీ విజయలక్ష్మి(29) ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వైఫల్యమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె తన ప్రియుడికి ఫోన చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ‘నువ్వు రా.. ..

Suicide : నువ్వు రాకుంటే చచ్చిపోతా..!
Vijayalakshmi (file)

ప్రియుడికి ఫోన చేసి.. సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య

అనంతపురం క్రైం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలోని ఆరో సచివాలయం ప్లానింగ్‌ సెక్రటకరీ విజయలక్ష్మి(29) ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వైఫల్యమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె తన ప్రియుడికి ఫోన చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ‘నువ్వు రా.. లేకుంటే నేను చచ్చిపోతా..’ అని ఆమె అన్నట్లు సమాచారం. ఆ తరువాత ఏం జరిగిందోగానీ, తన గదిలో ఉరి వేసుకున్నారు. ఆ తరువాత కాసేపటికి ఆమె ప్రియుడు అక్కడికి వచ్చి కిటికీ అద్దాలను ధ్వంసం చేసి ఆమెను కాపాడే


ప్రయత్నం చేశాడు. స్థానికుల సహకారంతో కిందకు దించాలని చూశాడు. కానీ అప్పటికే ఆమె మృతిచెందారు.

‘మీరెవరు..?’ అని స్థానికులు అడిగితే.. తానూ సచివాలయ ఉద్యోగినే అని చెప్పి ఆమె ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ప్రసన్నాయపల్లికి చెందిన విజయలక్ష్మి కొంతకాలంగా అనంతపురం రామచంద్రనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఏడాదిన్నర క్రితం తన సోదరి భర్త మృతి చెందడంతో ఆమెకు తోడుగా ఉండేవారని సమాచారం. ఇటీవల ఆమె అద్దె గదిలో ఒంటరిగా ఉంటున్నారు. నార్పల మండల పరిధిలోని ఓ సచివాలయంలో విలేజ్‌ సర్వేయర్‌గా పనిచేస్తున్న యువకుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. పెళ్లి చేసుకోవాలని అతన్ని ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం అతనికి ఫోన చేసి,

‘నువ్వు వెంటనే రా.. లేకపోతే చనిపోతా’ అని బెదిరించినట్లు సమాచారం. ఆ తరువాత విజయలక్ష్మి తన గదిలో ఫ్యానకు ఉరి వేసుకున్నారు. ఈ ఘటనపై త్రీటౌన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సెలవు కావాలని వచ్చి...

విజయలక్ష్మి గురువారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చినట్లు తెలిసింది. తనకు మూడు నెలల పాటు సెలవు కావాలని కోరినట్లు సమాచారం. ఆ సమయంలో టౌనప్లానింగ్‌ అధికారులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో కొంతసేపు వేచి ఉన్నట్లు తెలిసింది. ఆ తరువాత కాసేపటికే విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలిసినా నగరపాలక సంస్థ అధికారులుగాని, ముఖ్యంగా టౌనప్లానింగ్‌లో ఉన్న మహిళా అధికారులు గాని అటు వైపు కన్నెత్తి చూడకపోవడం చర్చనీయాంశమైంది. త్రీటౌన పోలీసులు సైతం ఆత్మహత్యకు కారణాలు ఏమిటో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. తమకు ఫోన ద్వారా విషయం తెలిసిందని, మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ శాంతిలాల్‌ తెలిపారు.


మ‌రిన్ని అనంత‌పురం వార్త‌ల కోసం...


Updated Date - Mar 07 , 2025 | 12:51 AM