Share News

DPO : నాకు ఉద్యోగం ఇవ్వాల్సిందే..!

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:37 AM

నాకు అన్ని అర్హతలున్నాయి... అందుకు అనుగుణంగా పోస్టు కేటాయించాల్సిం దేనని డిజిటల్‌ అసి స్టెంట్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ నాయక్‌ ఎస్సీ, ఎస్టీ కమిషనను ఆశ్ర యించారు. ఉద్యోగ నియామకాలు పూర్తయి ఐదేళ్లు గడుస్తున్నా.. పట్టువీడని బట్టీ విక్రమార్కుడిలా ఆయన తన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. కదిరి ప్రాంతానికి చెందిన శ్రీనివాసనాయక్‌ కుమారుడు వినోద్‌కుమార్‌ బీకాం(జనరల్‌) పూర్తి చేసినట్లు అధికారులు చెబుతు న్నారు.

DPO : నాకు ఉద్యోగం ఇవ్వాల్సిందే..!
DPO Office

ఎస్సీ, ఎస్టీ కమిషనను ఆశ్రయించిన ఓ నిరుద్యోగి

అనంతపురం న్యూటౌన, మార్చి 5(ఆంధ్రజ్యోతి): నాకు అన్ని అర్హతలున్నాయి... అందుకు అనుగుణంగా పోస్టు కేటాయించాల్సిం దేనని డిజిటల్‌ అసి స్టెంట్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ నాయక్‌ ఎస్సీ, ఎస్టీ కమిషనను ఆశ్ర యించారు. ఉద్యోగ నియామకాలు పూర్తయి ఐదేళ్లు గడుస్తున్నా.. పట్టువీడని బట్టీ విక్రమార్కుడిలా ఆయన తన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. కదిరి ప్రాంతానికి చెందిన శ్రీనివాసనాయక్‌ కుమారుడు వినోద్‌కుమార్‌ బీకాం(జనరల్‌) పూర్తి చేసినట్లు అధికారులు చెబుతు న్నారు. అదే అర్హతతో బీకాం కంప్యూటర్స్‌ అర్హత ఉన్న డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. వినోద్‌కుమార్‌కు బీకాం కంప్యూటర్స్‌ అర్హత లేకపోవడంతో ఉద్యోగ అవకాశం కల్పించకుండా తిరస్కరించారు. దీంతో అతడు అప్పటి నుంచి ఉద్యోగ అవకాశం కల్పించాలని పోరాటం చేస్తున్నాడు.


అధికారుల నుంచి తగిన స్పందన లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీ కమిషనను ఆశ్రయించాడు. దీంతో... వినోద్‌కుమార్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేకపోయారో... అందుకు గల కారణాలతో ఫైల్‌ సిద్ధం చేసుకుని హాజరు కావాలని అక్కడ నుంచి జి ల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో బుధవారం డీపీఓ నాగరాజ నాయుడు ఎస్సీ, ఎస్టీ కమిషన ఎదుట హాజరయ్యారు. దీనిపై డీపీఓ నా గరాజ నాయుడుని వివరణ కోరగా.. ఎస్సీ, ఎస్టీ కమిషన ఎదుట హాజరైన ట్లు తెలిపారు. తమ వద్ద ఉన్న వివరాలకు సంబంధించి అక్కడ నివేదిం చామన్నారు. వినోద్‌కుమార్‌కు అర్హత లేకపోవడంతో ఉద్యోగం ఇవ్వలేకపో యామన్నారు.. ఎస్సీ, ఎస్టీ కమిషన నుంచి వచ్చే ఉత్తర్వుల మేరకు ఉన్నాతాధి కారుల ఆదేశాలతో తగిన చర్యలు చేపడుతామని తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 06 , 2025 | 12:38 AM