GOD : హరహర మహదేవ.. శంభో శంకర
ABN , Publish Date - Feb 27 , 2025 | 12:59 AM
మహాశివరాత్రి వేడు కలను బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం నుం చే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఊరూవాడా అంతటా శివ నామస్మరణతో మార్మోగింది. చిన్నా.. పెద్దా అందరూ ఆలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకున్నారు.
వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి వేడు కలను బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం నుం చే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఊరూవాడా అంతటా శివ నామస్మరణతో మార్మోగింది. చిన్నా.. పెద్దా అందరూ ఆలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకున్నారు. స్వామి నామస్మరణ చేస్తూ భక్తిపారవశ్యం లో మునిగిపోయారు. జిల్లా కేంద్రంలో ఆరోరోడ్డులోని అమృత లింగేశ్వ రాలయంలో రుత్వికుల వేదమంత్రోచ్ఛారణ నడుమ శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. రామచంద్రనగర్‌లోని టీటీడీ కల్యా ణమండపంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో జాగరణ మహోత్సవం చేపట్టారు. పరిషత సభ్యుడు శ్రీపాద వేణు నేతృత్వంలో ఆధ్యాత్మిక ప్రశ్నల పోటీలు నిర్వహించడంతోపాటు భజనలు, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు కాలభైరవ కంకణాలను వితరణ చేశారు. మూడోరోడ్డులోని జీఆర్ ఫంక్షనహాల్‌లో అనంత శివారాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కాశీవిశ్వేశ్వర లింగానికి భక్తుల చేతులమీదుగా అభిషేకాలు చేయించారు. సాయంత్రం గిరిజా కల్యాణం నిర్వహించారు. రామచంద్ర నగర్ షిర్డీసాయిబాబా ఆలయంలో శివపార్వతుల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి పూజలు చేశారు. శివబాలయోగి ఆశ్రమంలో శివకామేశ్వరులకు భక్తుల చేత క్షీరాభిషేకం, బిల్వార్చన, సహ స్రలింగార్చన చేయించారు. అదేవిధంగా మంచులింగం ఏర్పాటు చేసి భక్తు లకు దర్శనభాగ్యం కల్పించారు. పాతూరులోని చెన్నకేశవస్వామి దేవాల యం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రజలు పెద్దఎత్తున దర్శించుకున్నారు. సాయంత్రం శివలింగాన్ని ప్రత్యేకం గా అలంకరించిన వాహనంపై ఉంచి ఊరేగించారు. అలాగే బెంగళూరు రోడ్డులోని శివకోటి, హౌసింగ్‌బోర్డు వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలోని శివాలయం, శారదానగర్‌లోని శృంగేరి శంకరమఠం, అరవిందనగర్ సర్వేశ్వ రాలయం, పాతూరు విరూపాక్షేశ్వరాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి ఆల యం, అశోక్‌నగర్‌లోని హరిహర దేవాలయం, హెచ్చెల్సీ కాలనీ మంజునాథ స్వామి దేవాలయం, చాముండేశ్వరి దేవాలయంతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నింటిలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....