WOMEN'S DAY : ఘనంగా మహిళా దినోత్సవం
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:47 PM
మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయాలని జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ పేర్కొన్నారు. శుక్రవారం జడ్పీ ప్రధాన సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అనంతపురం విద్య, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయాలని జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ పేర్కొన్నారు. శుక్రవారం జడ్పీ ప్రధాన సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య కేక్ కట్ చేసి, ఉద్యోగులకు పంచిపెట్టారు. ఏవోలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురం సెంట్రల్: సమాజంలోని అవకాశాలను అందుకుని ఆదర్శవంతంగా నిలవాలని మహిళలకు ఎస్కేయూ ఇనచార్జ్ వీసీ ప్రొఫెసర్ అనిత పిలుపునిచ్చారు. ఎస్కేయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాతీయ మహిళా వేడుకులకు వీసీ అనిత, డీఎం హెచఓ డాక్టర్ భ్రమరాంజదేవి, రిజి స్ర్టార్ రమేష్‌బాబు హాజరయ్యారు ‘ పుస్తకం-4’ ఆవిష్క రించి మాట్లాడారు. అ నంతరం వీసీ అనిత ను ప్రొఫెర్ శోభలత, డాక్టర్ లలతి, కల్పన తదితరులు సన్మానించారు.
అనంతపురం టౌన : జిల్లా వైద్య కళాశాలలో మహిళాదినోత్సవం కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డాక్టరు మాణిక్యాల రావు ముఖ్యఅతిథిగా హాజర య్యారు. తొలుత కేక్‌కట్ చేశారు. సీనియర్ మహిళా డాక్టర్లను సత్కరిం చారు. వైస్ ప్రిన్సిపాళ్లు షారోనసోనియా, సూపర్‌స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బెనెటిక్ట్ కోయిలో తదితరులు పాల్గొన్నారు. డా క్టర్లు నిహారిక, పరిణితసాయి ప్రదర్శించిన లఘునాటిక మహిళా ఉద్యోగులను కంటనీరు పెట్టించింది.
రాప్తాడు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నా రు. ఈ సందర్బంగా మహిళా అధికారులకు పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సర్పంచ సాకే తిరుపాలు, ఈఒఆర్డి ఆనంద్‌ప్రసాద్, ఎంఈఓ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా అంగనడీ సూపర్వైజర్ నాగరత్న ఆధ్వర్యంలో రాప్తాడులో ర్యాలీ నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....