REPUBLIC : ఘనంగా గణతంత్ర వేడుకలు
ABN , Publish Date - Jan 27 , 2025 | 12:19 AM
జిల్లా కేంద్రంతో పాటు అనంతపురం రూరల్, రాప్తాడు, శింగనమల, రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రాప్తాడు, రామగిరి మండలాల వ్యాప్తంగా ఆదివారం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జెండాను ఎగరవేశారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
జిల్లా కేంద్రంతో పాటు అనంతపురం రూరల్, రాప్తాడు, శింగనమల, రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రాప్తాడు, రామగిరి మండలాల వ్యాప్తంగా ఆదివారం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జెండాను ఎగరవేశారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ విప్ కా లవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌తో కలిసి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, రాష్ట్ర నాయకులు ఆ లం నరసానాయుడు, గడ్డం సుబ్రహ్మణ్యం, తలారి ఆదినారాయణ, బుగ్గ య్య చౌదరి, రామలింగారెడ్డి, దేవళ్ల మురళి, రాయల్ మురళి, కుంచెపు వెంకటేష్, నాయకులు సిమెంట్ పోలన్న, పోతుల లక్ష్మీ నరసింహులు, పరమేశ్వరన, కడియాల కొండన్న, సరిపూటి రమణ, కురబ నారాయణస్వా మి, స్వప్న, సంగా తేజస్విని, సరళ, భవానీ, చరిత, లక్ష్మీ నరసింహులు, నెట్టెం బాలకృష్ణ, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. అలాగే అనంతపురం అర్బన కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీజీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రామగిరి మండలపరిధిలోని తన స్వగ్రామమైన వెంకటాపురంలోని క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వాతంత్య్ర సమర యోధుల ను గుర్తు చేసుకున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....