Share News

COLLECTOR : పీ-4 ఆధారంగానే ప్రభుత్వ పథకాలు

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:52 AM

రాష్ట్రంలో ఆర్థికం గా వెనుకబడిన వాళ్లను గుర్తించేందుకే ప్రభుత్వం పీ-4 మోడల్‌ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపడుతోందదని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 41వ వార్డు సచివాలయం పరిధిలో జరుగుతున్న పీ-4 సర్వేని ఆయన శనివారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

COLLECTOR :  పీ-4 ఆధారంగానే ప్రభుత్వ పథకాలు
Collector examining the conduct of the survey

సర్వేను పరిశీలించిన కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

అనంతపురం టౌన, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్థికం గా వెనుకబడిన వాళ్లను గుర్తించేందుకే ప్రభుత్వం పీ-4 మోడల్‌ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపడుతోందదని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 41వ వార్డు సచివాలయం పరిధిలో జరుగుతున్న పీ-4 సర్వేని ఆయన శనివారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అక్కడ సిబ్బంది, ప్రజలను కలిసి ఈ సర్వే గురించి ఆరాతీశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పీ-4 (ప్రభుత్వ, ప్రైవేట్‌, పీపుల్స్‌ పార్టనర్‌ షిప్‌)సర్వేని పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెను క బడిన వారికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక కమిషనర్‌ బాలస్వామి, ఎంహెచఓ విష్ణుమూర్తి, వార్డు రెవెన్యూ సెక్రెటరీ సరోజ తదితరులు పాల్గొన్నారు.

నార్పల: రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూ లన కోసం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన పీ -4 సర్వేకి మండల ప్రజలు సహకరించాలని ఎంపీడీఓ గంగావతి కోరారు. సచివాలయ సిబ్బంది వివరాల కోసం ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితమైన సమాచారం అందించాలన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 23 , 2025 | 12:52 AM