Share News

TANK : నాడు వెలవెల..నేడు జలకళ

ABN , Publish Date - Jan 29 , 2025 | 12:15 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పామురాయి చెరువు వెల..వెల పోయింది. కూటమి అధికారం లోకి వచ్చాక జలకళ సంతరించుకుంది. నిండుకుండను తలపిస్తోంది. గత వైసీపీ హయాంలో చెరువు పూర్తిగా ఎండిపోయింది. దాదాపు మూడేళ్ల పా టు చుక్క నీరు లేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక చెరువుకు పూర్వ వైభవం వచ్చింది.

TANK : నాడు వెలవెల..నేడు జలకళ
The scene is currently splashing with water

అనంతపురం రూరల్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పామురాయి చెరువు వెల..వెల పోయింది. కూటమి అధికారం లోకి వచ్చాక జలకళ సంతరించుకుంది. నిండుకుండను తలపిస్తోంది. గత వైసీపీ హయాంలో చెరువు పూర్తిగా ఎండిపోయింది. దాదాపు మూడేళ్ల పా టు చుక్క నీరు లేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక చెరువుకు పూర్వ వైభవం వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవతో టీడీపీ స్థానిక నాయకులు చెరవుకు హెచ్చెల్సీ నీటిని విడిపించుకోగలిగారు. దీంతో చెరువు చాలా వరకు నిండింది. నీటితో తొణికిసలాడుతోంది. మరి కొన్ని రోజుల్లో చెరువు మరువ పారే పరిస్థితి కనిపిస్తోంది. చెరువు నిండటంతో చుట్టుపక్కల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో మూడేళ్ల పాటు తాగు, సాగునీటికి సమస్యకు బోకా ఉండదంటున్నారు. బోర్లలో నీరు మరింత వృద్ధి చెందాయన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఈక్రమంలో పామురాయి, సోములదొడ్డి తదితర ప్రాంతాల పరిధిలోని దాదాపు మూడు వందల ఎకరాలకు సాగు నీటికి ఇబ్బంది ఉండదంటున్నా. చెరువుకు నీరు చేరడంతో ఇటీవల చేపల పెంపకం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరు వేల చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులో వదిలినట్లు గ్రామస్థులు చెబున్నారు. మరికొన్నింటిని వదిలేందుకు ప్రయత్నం చేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 29 , 2025 | 12:15 AM