COLLECTOR : అర్జీల పరిష్కారంపై దృష్టిపెట్టండి : కలెక్టర్
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:35 AM
ప్రజాసమస్యల పరి ష్కార వేదికలో బాధితుల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించ డం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా అధికారులకు కలెక్టర్ వినోద్ కు మార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో సోమవారం ప్రజ ల నుంచి ఫిర్యాదుల స్వీకరణ నిర్వహించారు. గతవారం గ్రీవెన్స లేకపో వడంతో ఈ వారం బాధితులు పెద్దఎత్తున తరలి వచ్చారు మొత్తం 520మంది అధికారులకు వినతులు అందజేశారు.
అనంతపురం టౌన, జనవరి 27(ఆంధ్రజ్యోతి) : ప్రజాసమస్యల పరి ష్కార వేదికలో బాధితుల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించ డం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా అధికారులకు కలెక్టర్ వినోద్ కు మార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో సోమవారం ప్రజ ల నుంచి ఫిర్యాదుల స్వీకరణ నిర్వహించారు. గతవారం గ్రీవెన్స లేకపో వడంతో ఈ వారం బాధితులు పెద్దఎత్తున తరలి వచ్చారు మొత్తం 520మంది అధికారులకు వినతులు అందజేశారు. కలెక్టర్ వినోద్ కుమార్, జేసీ శివనారాయణశర్మ, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, డీఆర్‌ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, ఆనంద్, శిరీష, మల్లికార్జున తదితరులు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ వినోద్ కుమార్ దివ్యాంగుల వద్దకే వెళ్లి వినతులు తీసుకున్నారు. అనంతరం జిల్లా అదికారులతో అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....