Share News

LAND : చదును చేసి.. అమ్మకానికి..!

ABN , Publish Date - Feb 16 , 2025 | 01:04 AM

చిన్నంపల్లి పంచాయతీ, కురుగుంట గ్రామ సర్వే నంబరు98-3లోని వంక పోరం బోకు భూమిని వైసీపీ నాయకుడు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నా డు. మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణాన్ని చదును చేసి అమ్మకానికి పెట్టాడు.

LAND : చదును చేసి.. అమ్మకానికి..!
Vankaporam Boku is a view of flattened land

అనంతపురం రూరల్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): చిన్నంపల్లి పంచాయతీ, కురుగుంట గ్రామ సర్వే నంబరు98-3లోని వంక పోరం బోకు భూమిని వైసీపీ నాయకుడు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నా డు. మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణాన్ని చదును చేసి అమ్మకానికి పెట్టాడు. ఆత్మకూరు మండలం తోపుదుర్తికి చెందిన వైసీపీ నాయకుడు తన బామరిదితో కలిసి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు ఈ నెల 14న ‘ఆక్రమించు.. విక్రయించు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురిత మైంది. దీంతో వారు భూమి విక్రయ ప్రక్రియ వేగం పెంచారు. అమ్మలేకపోతే.. గుడిసెలు వేసైనా విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి ఆక్రమణదారులకు ఆసరాగా మారింది. కాగా, ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ మోహనకుమార్‌ అన్నారు. భూమిని చదును చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 16 , 2025 | 01:04 AM