CRICKET : ఎట్టకేలకు జిల్లా బాలుర క్రికెట్ జట్టు ఎంపిక
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:17 AM
వివాదాలు, ఆరోప ణల నడుమ ఎట్టకేలకు జిల్లా అండర్-12 బాలుర జట్టును ఎంపిక చేశా రు. ఎంపిక చేసిన తుది జట్టు వివరాలను జిల్లా క్రికెట్ సంఘం ఆదివారం స్థానిక ఆర్డీటీ స్టేడియంలో ప్రకటించింది.

అనంతపురం క్లాక్‌టవర్, జనవరి 5(ఆంధ్రజ్యోతి): వివాదాలు, ఆరోప ణల నడుమ ఎట్టకేలకు జిల్లా అండర్-12 బాలుర జట్టును ఎంపిక చేశా రు. ఎంపిక చేసిన తుది జట్టు వివరాలను జిల్లా క్రికెట్ సంఘం ఆదివారం స్థానిక ఆర్డీటీ స్టేడియంలో ప్రకటించింది. ఎంపికైన అండర్-12 బాలుర క్రికెట్ జట్టులో హవీష్‌రెడ్డి, హేమచంద్రనాయక్, ధనుష్, జైవీర్ రెడ్డి, తమోజ్ఞ, లలిత కిషోర్, రోహితేశ్వర్ రాజు, చరణ్‌తేజ్, రామ్‌చరణ్, ఉత్తేజ్‌యాదవ్, ఇస్మాయిల్, మోక్షనతేజ, గణేష్, బురాద్దీన, వెంకటలిఖిత రెడ్డి ఉన్నారు. స్టాండ్‌బైలుగా కుషాల్ రాయల్, కమ్రానఫహాడ్, మన్నన, లలితసాయి, రాజా, ప్రజ్వల్ ఎంపికయ్యారు. ఎంపికైన జట్టు కడపలో ఈనెల 6వ తేదీ నుంచి నిర్వహించే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన సౌతజోన క్రికెట్ పోటీలకు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ఇనచార్జ్ సెక్రటరీ భీమలింగారెడ్డి, సెలెక్షన కమిటీ చైర్మన కమలాకర్ నాయుడు, సభ్యులు ఎస్‌ఎల్‌ఎన ప్రసాద్, భార్గవ్, మధు ఆచారి, యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....